చార్మినార్ యాస్బెస్టాస్ సిమెంట్ రేకులు పేరడీ
ఏంటి రాజశేఖర్, దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?
ఆ ఏంలేదు లాలూ, సుడి తిరిగి మళ్ళీ నేనే గెల్చా. నా కొడుకు టీవీ బిల్డింగుకీ, అల్లుడి ఫార్మ్ హౌసుకీ పైకప్పు ఏమి దోచి వేయిద్దామా అని ఆలోచిస్తున్నా?
హిహిహి..(వెర్రి నవ్వు) ఇందులో పెద్దగా ఆలోచించటానికేముంది? రింగురోడ్డు, ఎయిర్పోర్టు తాకట్టుపెడితే సరి. నేను గతంలో ఇలానే పశువులకేసే గడ్డి అమ్ముకొని చాలా పైకప్పులు వేసుకొన్నాను. మా తాతగారు ఇలా సంపాదించిన డబ్బుతో వేసిన పైకప్పులు ఇంకా చెక్కు చెదరలేదు.
అలాగా, నిజమే. నువ్వు చెప్పినట్లే మన రింగురోడ్డు, ఎయిర్పోర్టు తాకట్టు పెట్టి మా బడుద్దాయిలకి పైకప్పులు వేయిస్తా.
**************************************************************
ఉడ్వర్డ్ గ్రైప్ వాటర్ (పాప ఏడ్చింది) పేరడీ
మేడం : హిహి…హిహి…హిహి
యువనేత : ఎవరది?
కార్యకర్త : మేడం నవ్వింది
యువనేత : ఉండు. చొంగ కార్చి, సూట్ కేసిచ్చొస్తా!
నేత తండ్రి : ఎ..వ..రు….అ..ది
యువనేత : మేడం నవ్వింది
నేత తండ్రి : చొంగ కార్చి, సూట్ కేసిచ్చిరా. మా కాలంలో మేమదే చేశాం!
నేత తాత : ఎ..వ..రు….అ..ది
నేత తండ్రి : మేడం నవ్వింది
నేత తాత : చొంగ కార్చి, సూట్ కేసిచ్చిరా. మా నాన్న అలానే చేసేవాడు.
నేత తాత తండ్రి : ఎ..వ..రు….అ..ది
***************************************************************
లిఫ్ట్ కరాదే (అద్నాన్ సమీ) పేరడీ
డీఎమ్కే, మమతా బెనర్జీలు బెదిరించి క్యాబినెట్ పదవులు తీసుకెళ్తున్నారో పక్క, మరో పక్క మన ఆంధ్రా కాంగ్రెస్ ఎంపీలు మేడం ఇంటి ముందు దీనంగా ఇలా అద్నాన్ సమీ పాట పాడుకుంటున్నారు….
తేరి ఊంఛీ షాన్ హై మేడం, హమ్రీ అర్జీ మాన్లో మేడం
తూ హై సబ్ కుచ్ జాన్ నే వాలీ, హమ్ హై తుజ్కో మాన్ నే వాలే
హమ్కో భీ తో లిఫ్ట్ కరాదే, థోడి సీతో లిఫ్ట్ కరాదే
కైసె కైసోంకో దియా హై, ఐసే వయిసోంకో దియాహై
క్యాబినెట్ యా స్టేట్ దిలాదే, ఏక్ నహీ దో చార్ దిలాదే
హాథ్ జోడ్కే సలాం కరేంగే, జిందగీ భర్ గులాం బనేంగే
హమ్కో భీ తో లిఫ్ట్ కరాదే, థోడి సీతో లిఫ్ట్ కరాదే
బంగ్లా మోటర్ గాడీ దిలాదే, హమ్ కో ఏరోప్లేన్ దిలాదే
దునియా బర్ కీ సైర్ కరాదే….
కైసె కైసోంకో దియా హై, ఐసె వైసోంకో దియా హై
హమ్కో భీ తో లిఫ్ట్ కరాదే, థోడి సీతో లిఫ్ట్ కరాదే..
వికటకవి యొక్క టపా
వికటకవి యొక్క టపా
వికటకవి యొక్క టపా 
