నా గురించి

నేను ఉత్తర అమెరికాలో ఓ సాఫ్టువేరు ఉద్యోగం వెలగబెడుతున్నాను. ఇల్లు, ఇల్లాలు మరియు పిల్లలతో గృహస్తాశ్రమం నిర్వర్తిస్తున్నాను. స్వతహాగా సాహితీ మరియు హాస్యప్రియత్వము కలవాడిని.

సగటు భారతీయుడి ప్రధాన కాలక్షేపాలయిన క్రికెట్టు మరియు సినిమా అనే రెండు వ్యాపకాలతో నేనూ ఒకప్పుడు సహజీవనం చేసేవాడిని, అజహరుద్దీను క్రికెట్టు మీద, బాలకృష్ణ సినిమా మీద విరక్తి కలిగించనంత వరకూ. క్రికెట్టుకి దాదాపు దూరమయ్యాను కానీ సినిమాలు మాత్రం బలహీనత  వల్ల బాలయ్యని తట్టుకొనైనా సరే మరీ చూస్తున్నాను.

 

 

3 స్పందనలు to “నా గురించి”

  1. tethulika అన్నారు:

    వికటకవిగారూ, నాకు కొంచెం సాయం కావాలి. జీర్ణమంగే సుభాషితం అన్న వాక్యానికి కాస్త వివరణ చెప్తారు. ఆరుద్రగారు నాకు రాసిన ఉత్తరంలో కొట్ చేసారు.
    నెనరులు
    మాలతి

  2. వికటకవి అన్నారు:

    మాలతి గారు,

    అసలు ఇది భర్తృహరి నీతి శతకంలోనిది.

    బోద్ధారో మత్సరగ్రస్తాః — పండితులు అసూయా గ్రస్తులయిరి
    ప్రభవః స్మయదూషితాః — ప్రభువులు గర్వముచే పీడింపబడిరి
    అబోధోపహతాశ్చాన్యే — ఏమీ తెలియనివారు ఇతరములైన పనులచే వ్యస్తులైరి
    జీర్ణమంగే సుభాషితం — (అందుచేత) ఈ సుభాషితములు నాలోనే జీర్ణమవుచున్నవి(విని ఆచరించువారు లేక).

    “జీర్ణమంగే సుభాషితం”
    పండితుల వ్యావహారికంలో అదొక కొటేషన్, మంచికి చెపితే వినే నాధుడు లేనప్పుడు, విషయాన్ని నాలోనే దిగమింగుకుంటాను అని…..

  3. tethulika అన్నారు:

    చాలా చాలా నెనరులు సార్.
    మాలతి

ప్రత్యుత్తరమిమ్ము