నేటి తెలుగు కథ

తెలుగు కథ అనగానే నాకు చదవాలంటే భయం. ఎందుకంటే, ఎంతసేపు బరువయిన పాత్రలు, సంభాషణలు పలికిద్దామనే తాపత్రయమే తప్ప, అసలు ఈ కథని ఒక సామన్యుడు (నేననుకునే సామాన్యుడికి తెలుగు బాగా చదవటం, వ్రాయటం మరియు అర్థం చేసుకోవటం మాత్రమే వచ్చు సుమండీ, వాడికి తెలుగులో ఎమ్మేలు, పీహెచ్డీలు ఉండవు) చదువుతాడా లేదా అన్న ఆలోచనలు కనపడవు.

క్షమించాలి, దయచేసి కథా రచయితలు కథ, వస్తువు, కథనం, విశ్లేషణ, భావుకత లాంటి బరువయిన పదాల ఊబి లోంచి బయట పడ్డట్టయితే, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు చదవగలుగుతారు.

జల్లెడలో కొత్తపాళీ గారి బ్లాగు చూసి ఈ కథ ఇద్దరు దుర్మార్గులు దగ్గరికి వచ్చాను.

నేను కథ లోతు పాతులకు వెళ్ళ దలచుకోలేదు. ఎంచేతంటే, ఈ కథ పైన ఉదహరించిన వాటికి అతీతమేమీ కాదు. బహుశ రచయిత కూడా అదే ఊబిలో దిగబడిపోతున్నాడేమో అనిపిస్తోంది.

ఈ సామాన్యుడి అభిప్రాయం తప్పనిపిస్తే, దులిపేసుకోండి. విషయముందనిపిస్తే, గ్రహించగలరు!

–వికటకవి

3 స్పందనలు to “నేటి తెలుగు కథ”

  1. chavakiran అన్నారు:

    వీటిని కూడా ఓ సారి చదవండి మరి

    http://oremuna.com/blog/?cat=7

  2. కొత్త పాళీ అన్నారు:

    గత రెండేళ్ళ కథ సంకలనాల్లో కథలు బాగున్నాయి. నా సమీక్షలు ఇక్కడ చూడొచ్చు
    కథ 2005
    కథ 2006
    ఈ రెండు సంకలనాల్లో కొన్నైనా మీకు నచ్చుతాయని నా హామీ. కథ 2005 లో జ్ఞాతం, కథ 2006 లో “మా నాన్న, నేను, మా అబ్బాయి” ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన కథలు.

  3. వికటకవి అన్నారు:

    నేను నిజానికి తెలుగు కథకి అంత పెద్ద అభిమానిని కాను. ఆంధ్రజ్యోతిలో చదువుతూనే ఉంటాను కాని ఎంతసేపూ దళిత కథలు, బడుగు జీవులు, స్త్రీ వాదం అంటూనే ఉంటారు తప్ప ఇంకెవడికీ బాధలు, కన్నీళ్ళు, ఆనందం ఉండవనుకుంటారో ఏమో? దాంతో అసలుకే ఎసరు వచ్చి ఇంకా తక్కువ చదటం జరిగేది. ఆనందం, సంతోషం ప్రధానంగా అసలు కథలే కనపడవు.

    మీరు చెప్పినవి తప్పక చదువుతాను. తెలుగు కథ అంటే మళ్ళీ ఆసక్తి కలుగుతుందేమో!

ప్రత్యుత్తరమిమ్ము