డబ్బింగ్ సినిమా పాటల్లో తెలుగు సాహిత్యం

స్పందించే మనసుండాలేగాని మంచి సాహిత్యం ఉన్న సినిమా పాటలు ఆ మాటకొస్తే ఏ పాటైనా  అసంకల్పితంగా, అలవోకగా మన మనసును హత్తుకుంటాయి.

సినీ గీతాల్లో మంచి సాహిత్యం (అత్యాశే అయినా వేటూరి, సిరివెన్నెల లాంటి వారివల్ల ఇంకా అడియాస కాలేదు)వింటూ ఆనందించే నాకు, కొన్ని డబ్బింగ్ సినిమాల్లోని పాటలు కోపంతో పాటు బోలెడు హాస్యం పంచుతాయి. డబ్బింగ్ చిత్రాల పాటలకు నేను పాటల రచయితను తప్పు పట్టను కాని ఒక్కోసారి వాళ్ళు రాసింది అర్థంగాక నవ్వొస్తుంది. “ఒకే ఒక్కడు” సినిమాలో ఈ పాటలో ఈ వాక్యాలకు ఎవరైనా మహానుభావుడు అర్థం చెప్పి కాస్త పుణ్యం కట్టుకోరూ?

పాట పేరు : మగధీర …
గాయనీ గాయకులు : జానకి, శంకర్ మహదేవన్
అర్థంకాని వాక్యం : “నీ కంట నీరు తుడవంగ ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా”

8 స్పందనలు to “డబ్బింగ్ సినిమా పాటల్లో తెలుగు సాహిత్యం”

  1. శ్రీనివాస రాజు ఇందుకూరి.. అన్నారు:

    “నీ కంట నీరు తుడవంగ ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా”

    ఆ సినిమాలో అర్జున్.. రాజు..(ముఖ్యమంత్రి) కదా!!..
    అందుకే.. నీ కంటనీరు తుడవటానికి..ఊరిజనాలకు కుళాయి నీళ్ళీస్తా
    అని అర్ధం వచ్చింది..

    ఇదింకా పర్వాలేదు.. కొన్ని అసలు అర్ధంకావు..
    ట్యూన్ ముందుగా తెలియడంవలన.. అర్ధానికి లోబడి రాయడం వలన
    అనుకుంట.. డబ్బింగ్.. పాటలు.. కాస్త వినసొంపుగా ఉండవ్..

  2. వికటకవి అన్నారు:

    అబ్బే, అది కరక్టు కాదనుకుంటా. నేను అనుకున్నదేమంటే, ఆవిడ గారి కంటినీరు తుడిస్తే, ఊళ్ళో కుళాయిల్లో నీరింక వస్తాయా అని? (అంటే ఈవిడ గారి కంటి నీరు కుళాయిళ్ళో నీరుగా ప్రవహిస్తోందన్నమాట. రచయిత ఆమె కన్నీటి ప్రవాహాన్ని ఉపమానంగా అలా చెప్పడేమో అని.). చంఢాలంగా ఉంది గదా ఈ అర్థం. ఇలా నేను, నా ఫ్రెండు చాలా విపరీతార్థాలు తీసి వదిలేసాము. ఇంతకీ, ఆ రచయిత ఏ భావంతో రాశాడో?

  3. శ్రీనివాసరాజు దాట్ల అన్నారు:

    మీరు పొరపడ్డారండీ! ఈ సినిమాలో అర్జున్‌ పాత్ర గురించి మీకు తెలుసుకదా. ప్రియురాలికన్నా తన పదవికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. ఆ విషయమే ఈ పాటలో అవగతమవుతుంది. “కత్తుల సవ్వడి విన్న వీరా… గాజుల సవ్వడి వినుకోవేరా” అని పాట పల్లవిలో అడుగుతుంది. చరణంలో “మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా” అన్న దానికి దదులుగా “నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా” అని అంటాడు. ఇక్కడ అర్ధం ఆమెను పట్టించుకు కోర్చుంటే ప్రజల బాగోగులు పట్టిచుకునేదెవ్వరు అని. ఒకసారి మళ్ళీ పాట మొత్తం వినండి మీకే అర్ధం అవుతుంది.

  4. వికటకవి అన్నారు:

    మీరు కరక్టేనండి. హమ్మయ్య, మొత్తమ్మీద నా సందేహం నివృత్తి చేసారు. చాలా థాంక్స్!

  5. రాజారావు తాడిమేటి అన్నారు:

    boys చిత్రంలో పాటలు విన్నారా..?

    “కుళ్ళిపోయిన మామిడిలో జత పురుగులమై ఉందాం..”
    “కనుబొమ్మలే దిగి మీసమాయెను..”

    7/G బృందావన కాలనీ సినిమాలో

    “నువ్వు లొట్టలేసి తినగా అమ్మాయ్‌లేమీ ఆవకాయ్ కాదురా..”

    ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో..

  6. వికటకవి అన్నారు:

    @రాజారావు గారు,

    అబ్బో ఈ బాయ్స్ లో పాట మరీ చంఢాలంగా ఉంది. ఎప్పుడూ వినలేదు. :-)

  7. raju అన్నారు:

    avunu ee dabbing songs chala chandalanga untai andhukane nenu vatini vinanu

  8. madhuri అన్నారు:

    ivinka nayam sir, ee madhya release aina dasavatharam audio paatalu oka sari vini chooste asalu paatalu veellu em aalochinchi raastaru ane anumanam vastundi.

ప్రత్యుత్తరమిమ్ము