తెలుగు సినిమాల్లో మనల్ని ఆనందింపచేసే వాళ్ళతో పాటు హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది థీముగా “చిత్రవధ” అని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందానిపిస్తుంది. ఇందులో నేను హింసించదలచుకునే నటులు కొందరున్నారు. ప్రాధాన్యతాక్రమంలో …
ఆర్.నారాయణమూర్తి - ఈయన సినిమా చూస్తూంటే, మనం సినిమాకొచ్చామనే ఫీలింగే ఉండదు. ఈయనతో పాటు కొండల్లో, కోనల్లో తిప్పేస్తూ ఉంటాడు. మంచి రౌద్రం నుంచి ఉన్నట్టుండి ” నీ కాలి కింద పుట్టుమచ్చనై పోతా చెల్లమ్మా” అంటూ దారుణమైన మెలోడ్రామాతో హింసించి, చిత్రసీమలో ఎవ్వరూ నవ్వలేనివిధంగా నవ్వేస్తాడు. దీంతో ప్రేక్షకులు “జీవితం” పైన విరక్తి చెందుతారు. నిజానికి, విరక్తి సినిమాపై కలగాలి కాని మొదట చెప్పినట్టు ప్రేక్షకులకి సినిమాకొచ్చామనే ఫీలింగ్ కన్నా, నిజ జీవితం ఫీలింగ్ ఎక్కువై ఆ ఫీలింగ్ …
జే.డి.చక్రవర్తి - ఏక్టింగ్ తక్కువ ఓవరేక్టింగ్ ఎక్కువ (నన్ను దారుణంగా హింసించాడు, దేవుడిచ్చిన నా ఆయుష్యులో వీడు కనీసం కొన్ని క్షణాలు హరించాడు). రాంగోపాల్ వర్మ అండతో, కేవలం ప్రేక్షకుల్ని హింసించే ఏకైక లక్ష్యంతో ఉంటాడు. సినిమాల్లో నటించటానికి నటన అవసరంలేదన్న నగ్న సత్యాన్ని పబ్లిక్ చేసి, తనలాంటి వారికి దారి చూపించాడు.
బాలక్రిష్ణ - నేను ఈయన గారి సినిమా చూసే అర్హత లేదనుకునేంతగా నటించి, నాకు జీవితాన్ని ప్రసాదించాడు. “తినగ తినగ వేము తియ్యనగును” కి గొప్ప ఉదాహరణ. తన మాటతో, సౌండుతో విలన్లను చంపి ఇప్పుడు సైగలతో చంపే పనిలో ఉన్నాడు.
ఇంకా కొందరున్నారు, మరెప్పుడయినా చెపుతాను! ప్రస్తుతానికి నా ఊహా “చిత్రవధ” లో వీరిని చెండాడుతాను.
ఫై వారికి ఎవరయినా విసనకర్రలయితే (FANs) లైట్ తీస్కోండి!


6:17 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 3, 2007
Naa blog choosinanduku ..naa paata vinnanduku thanks andi
6:27 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 3, 2007
Bavundi i Chitra vadha…inka chalamandi unnarandi i list lo…
11:10 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 3, 2007
అవునవును. ఉన్నారు మనపాలిటి యమధర్మరాజులు. కాని నా రాంకింగ్ వీళ్ళతొనే మొదలు..
2:13 అపరాహ్నం వద్ద ఆగష్టు 3, 2007
funny!
Another unbearable one is comedian Brahmanandam.
2:43 అపరాహ్నం వద్ద ఆగష్టు 5, 2007
ఎందరో మహానుభావులు. మీరు జాబితా తయారు చేస్తే చాలా పేర్లు కలుస్తాయి. బ్రహ్మానందం కొన్ని సినిమాల్లోనే ఎడిపిస్తాడు గాని మిగతా సినిమాల్లో పరవాలేదు అనుకుంటాను
10:55 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 6, 2007
లేటెస్తుగా చెప్పాలంటె “చంద్రహాస” సినిమా తీసిన హీరొ అనబడే వ్యక్తి.
పేరు “హరనాత్” అనుకుంటా.
6:13 అపరాహ్నం వద్ద ఆగష్టు 6, 2007
VJ గారూ - ఆయన మావూళ్ళొనే ఉంటార్ట. ఆ మధ్య తానా పత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన వేసుకున్నాడు - విచిత్రమైన వ్యక్తి. ఆ ప్రకటన చదివాక సినిమా గురించి కుతూహలంగా ఉంది గానీ ఇంకా చూసే ధైర్యం చెయ్యలా.
చాలా ఏళ్ళ తరవాత మొన్నీమధ్య బాలక్రిష్ణది “లక్ష్మీ నరసింహా” చూశా - ఆయనకి మాటిమాటికీ తోడలు చరుచుకునే పిచ్చేంటో అర్ధం కాలే - మిగతా సినిమాల్లో కూడా చేస్తాడా?