సెకండ్ హ్యాండ్ కారు అందంగా ఉండకూడదా?

ఈ మధ్యే నా హోండా ఎక్కార్డు కారు అమ్మకానికి ఆన్లైన్లో పెట్టా. నేనిచ్చిన వివరాలివి.

1)బాగా మెయింటేన్ చేయబడింది.
2)అన్ని సర్వీసులూ టైముకి చేయబడినవి.
3)50000 మైల్స్, అందులో దాదాపుగా అంతా హైవే మీదే తిరిగింది.
4)వ్యాన్ కొనదలుచుకున్నాను, అందుచేత అమ్ముచున్నాను.
5)ధర ఎడ్ముండ్స్ లేదా కేబిబి వారు నిర్ణయించిన ప్రకారం.(షుమారు $13000)

ఈ ప్రక్రియలో నాకు, కొనదల్చుకున్న వారి మధ్య జరిగిన కొన్ని హాస్య సంభాషణలు మరియు ఉత్తర ప్రత్యుత్తరములు :

ఒక్క స్క్రాచ్ కూడా లేని, ఇంత బాగున్న కారు ఎందుకమ్ముతున్నాడో అని అనుమానమొకడికి, సీతాదేవిని అనుమానించిన రాముడిలా. అగ్నిప్రవేశంతో రాముడు సీతమ్మని నమ్మాడు గాని, అన్ని రకాల రిపోర్ట్లు ఇచ్చినా ఏదో తెలియని బాధ ప్రబుద్ధుడికి.

ఒకడి ప్రశ్న, ఏ హైవే మీద తిరిగింది? (నా బుర్ర తిరిగింది ఈ ప్రశ్నకి, పోన్లే ఇంకా నయం, ఎందుకు తిరిగిందని అడగలేదని సరిపెట్టుకున్నా)

ఇంకో పదివేల మైళ్ళు తిరిగాక, అంటే 60000 తిరిగిన తరువాత సర్వీస్ కి వెయ్యి డాలర్లు అవుతాయి. అది ఇప్పుడే మైనస్ చెయ్యమన్నాడొకడు. (ఇదేమి లాజిక్కో అర్ధంగాక జుట్టు పీక్కున్నా, అంతలోనే కొనేవాడికి అమ్మేవాడెప్పుడూ లోకువే అనుకొని సర్దిచెప్పుకున్నా)

మరో ఆవిడ, కూరగాయలు కొన్న అలవాటో ఏమో, కేబిబి రేటు నుంచి సగం తీసేసి $7300 కి ఇస్తారా అంది? ఆ ఆఫర్ ఇచ్చిన ఆమె ధైర్యానికి మనసులో జోహార్లు చెప్పుకుంటూ, ఇంకెవ్వరినీ ఇంతగా అవమానించకు తల్లీ అని ఈ మెయిల్లో వేడుకున్నా!

చివరికెవడో ఒక రావణుడు (రామునిలా అనుమానించలేదు, అందుకని అలా అన్నాను) తగిలాడు. వాడి కీర్తిని పొగిడి నా కారుని అమ్ముకొని ($12000 కు), ఈ సెకండు హ్యాండు బేరం నుంచి “హతవిధీ” అనుకుంటూ బయట పడ్డా!

“భార్యా రూపవతీ శత్రు:” అని విన్నా కాని చూడబోతే “సెకండు హ్యాండు కారూ రూపవతీ శత్రు:” అని కూడా అనాలేమో!

7 స్పందనలు to “సెకండ్ హ్యాండ్ కారు అందంగా ఉండకూడదా?”

  1. కొత్త పాళీ అన్నారు:

    ఇది చాలా సత్యం, నా అనుభవం కూడా. ఎలాగైతేనేం బయట పడ్డారు. ఇంతకీ ఏం వాను కొన్నారు?

  2. వికటకవి అన్నారు:

    ఇంకా లేదండి. ఇవ్వాళో రేపో కొనాలి. సియన్నా కొంటానేమో!

  3. deepthi అన్నారు:

    bavundi me second hand car gola…so kothadi kontaranamata ….:)

  4. రానారె అన్నారు:

    హ4.

  5. నాగరాజా అన్నారు:

    ఈ అనుభవం అంతా డీలరు మీద చూపించొచ్చు ఇక!

  6. Dileep అన్నారు:

    బాగున్నాయి తమాషాగా వరి సందెహలు మీ సమాదానాలు.

    దిలీప్.

  7. Giri అన్నారు:

    వికటకవివర్యా,
    నేనిక ఢీలా పడి డీలరు దగ్గరకి వెళ్లాలేమో :) సగం ధరా – హ హ

    గిరి

ప్రత్యుత్తరమిమ్ము