![]()
తనదైన వ్యక్తిత్వం, గాత్రం భానుమతి గారి సొంతం. వేలమందిలోనూ అలవోకగా గుర్తించగలిగే విలక్షణమైన గొంతుక ఆవిడది. భానుమతి గారి నటనకి నేను పెద్ద అభిమానిని కాకపోయినా, ఆవిడ గాత్రానికి మాత్రం దాసోహమే. ముఖ్యంగా విప్రనారాయణ, గృహలక్ష్మి, క్షేత్రయ్య, మల్లీశ్వరి సినిమాలలోని ఈ పాటలు నా ఆల్ టైం హిట్స్. వినండి.


9:19 అపరాహ్నం వద్ద ఆగష్టు 8, 2007
నాకయితే ఈమె కొంచం అహంభావేమో (లేక అధిక ఆత్మవిశ్వాసేమొ) అనిపిస్తుంది. నా దగ్గర ఆధారాలు లేవు గానీ ఎందుకో అలా అనిపిస్తుంది.
–ప్రసాద్
http://blog.charasala.com
9:33 అపరాహ్నం వద్ద ఆగష్టు 8, 2007
Yup. She’s quite something.
I also like her rendition of Tyagaraja kriti “pakkala nilabadi” and the jaavali “manci dinamu nede” – don’t know the films. If you find them anywhere in the electronic ocean, do let us know
Oh, BTW, here’s a brief write up on her
http://vinnakanna.blogspot.com/2007/03/blog-post_15.html
9:38 అపరాహ్నం వద్ద ఆగష్టు 8, 2007
నేనూ మీలాగే అనుకునేవాణ్ణి. కాని ఆవిడ నవతరం సినిమాలు “పెద్దరికం” లాంటివి చూసాక అర్థమయింది, ఆవిడ వ్యక్తిత్వమే అలాంటిదని. అదేమీ తప్పు కూడా కాదు, కాకపోతే అంత ఆత్మవిశ్వాసం గల ఆడవాళ్ళు ఆ రోజుల్లో తక్కువే గదా! అదే కాస్త కొత్తగా/ప్రత్యేకంగా అనిపిస్తోందేమో మనకి.
9:46 అపరాహ్నం వద్ద ఆగష్టు 8, 2007
నాకసలు ఆవిడ “పక్కల నిలబడి” కీర్తన పాడారని తెలియదు. అది నాకూ ఇష్టమైన కీర్తనే. ఎందుకో, మీ కామెంట్ ని wordpress స్పాం కింద జమ కట్టింది. కారణం తెలియదు.
2:54 అపరాహ్నం వద్ద ఆగష్టు 9, 2007
వికటకవి గారూ,
బహుశా కొత్తపాళీ గారు తమ కామెంటులో ఓ లంకె ఇచ్చారు గనుకనేమొ! మరయితే నేనూ ఇచ్చానే! మీరు మీ set upలో రెండు లంకెల వరకూ ఇచ్చినా స్పామ్ కాదు అని configure చేసుకోండి.
–ప్రసాద్
http://blog.charasala.com
3:17 అపరాహ్నం వద్ద ఆగష్టు 9, 2007
@ప్రసాద్ గారు,
కృతజ్ఞతలు అలానే చేస్తాను.
10:22 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 11, 2007
manchi paaTalu gurtu chesaaru. alaage malleeswarilO “endukE neekanta tondaraa” vinanDi. khamas raagam sinimaa paaTallO anta andamgaa paaDaDam ekkaDaa vinaledu…
12:35 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 19, 2007
భానుమతి గారి పాట ఇంకోతి
“శ్రీకరకరుణాల వాల వేణుగోపాలా” ..నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి. ౮౦/౯౦ లలో పాడిన “శ్రీ సుర్యనారాయణా మేలుకో” కూడా.
భానుమతి గఋ సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో పట్టు కలిగియుండటమే కాక, పద్య రచయిత్రి కూడా. మత్తేభాలే నాకు లొంగేవి కావు అని చెప్పుకున్నారు. పెన్నెండు, పదమూల్లే క్రితం, అంధ్రజ్యోతిలో రాముడి కి సొంత ఇల్లు ఎందుకు లేదు ( అయోధ్యలో) అన్న విషయాన్ని రాముడి జాతకచక్రపరంగా విశ్లేషించారు.
గురువుగారు,
ఈ పుస్తకం గురుంచి వినటం ఇదె ప్రధమం. వీలు(పుస్తకం) చిక్కి నప్పుడు చదవాలి