ఆహా థాపర్ మహాశేయా, ఎంత చక్కగా కమ్యూనిస్టుల తలంటావయ్యా?

అదేదో సామెత ఉంది గద “మొరిగే కుక్క కరవదని”. మన కమ్యూనిస్టులు తీరలాగే ఉంది. తామేదో జాతి రక్షకులమని పేరుతెచ్చుకుందామని మన (అ)ప్రధాని మన్మోహన్ ని అణు ఒప్పందం మీద గట్టిగా బెదిరించారో లేదో, తిక్కరేగిన (అ)ప్రధాని గారు తిరిగి వాళ్ళని మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి పొండి అన్నాడు కన్యాశుల్కం లో లుబ్దావధాన్లు గనక “తాంబూలాలు ఇచ్చేసా,తన్నుకు చావండి” అన్నట్లు.

(అ)ప్రధాని ఇంత దెబ్బ కొడతాడని ఊహించని కమ్యూనిస్టులు ఇప్పుడు జాతికి ఎందుకు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవట్లేదో చెప్పలేక నానా గడ్డి కరుస్తున్నారు. ఇలాంటి పనికి మాలిన బెదిరింపులతో ఇదివరకు స్టాక్ మార్కెట్ ని ఉత్తపుణ్యానికి పడగొట్టి ఎందరిదో ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తంతు, లాక్కో లేక పీక్కో లేక.

సీతారాం ఏచూరి అంతటివాడు కరణ్ థాపర్ ప్రశ్నలకి నీళ్ళు నమలటం చూస్తుంటే, నా సామిరంగా తెగ సంబరపడ్డా, ఎంత బాగా ఎండగట్టావు నాయనా మా అందరి తరపున అనుకుంటూ. వీలైతే మీరూ ఓ లుక్కెయ్యండి డెవిల్స్ అడ్వకేట్ మీద.

అలానే కొన్ని నెలల క్రిందట ఇదే థాపర్ మహాశేయుడు మన వైయస్సు ని ముప్పు తిప్పలు పెట్టాడు.

5 స్పందనలు to “ఆహా థాపర్ మహాశేయా, ఎంత చక్కగా కమ్యూనిస్టుల తలంటావయ్యా?”

  1. మధు అన్నారు:

    అంతలేదు మాష్టారూ! మీరు సరిగ్గా గమనించారో లేదో, అక్కడ కరణ్ థాపర్ సీతారాం ఏచూరి అన్నట్టు, తన టి.వీ చానెల్ ప్రచారం కోసం కాబోలు, అవతలి వాళ్ళు ఎంత రేషనల్గా మాట్లాడుతున్నా, తను వాదించిందే కరెక్టు అన్నట్టు కవరింగ్ చేశాడు. అసలు ఎక్కడా మాట్లాడనివ్వలేదు కదా.

  2. nuvvusetty అన్నారు:

    ha ha haa…

  3. వికటకవి అన్నారు:

    మధు గారు,

    విషయం అది కాదు. థాపర్ వేసిన మొదటి ప్రశ్నకి (మీకు అణు ఒప్పందం అభ్యంతరమైతే దాన్ని ఆపటానికి మీరు బెదిరించినట్లుగానే ఎందుకు మద్దతు ఉపసంహరించుకోరు?)సమాధానమేది? సగటు రాజకీయ నాయకుడి మల్లే తప్పించుకుందామని చూశారు గాని, మన థాపర్ ఆ ఆటలు సాగనివ్వలేదు. సమాధానం చెప్పుకోలేని ఉక్రోషం ఏచూరి గారి కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. మీరన్నట్లు అది థాపర్ మాట్లాడనీయకపోవటం కాదు. ఆయనల్లా, అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి అప్పుడు ముందుకు వెళ్ళ మంటున్నాడంతే.

  4. ప్రసాద్ అన్నారు:

    వికటకవి గారూ,
    మీ అభిప్రాయంతో నేణు ఏకీభవించటం లేదు. మధు గారన్నదే కరక్టు.

    కెమరా థాపర్ కళ్ళ మీద ఫోకస్ చేసి వున్నట్లయితే ఆయన బలహీనత ఆ క్షణంలో కనిపించి వుండేది. ఏ వ్యక్తినైనా తన వాదనని చెప్పనీకుండా అడ్డుకుంటే కళ్ళల్లో ఏచూరికి వచ్చిన ఆవేశమే వస్తుంది. ఆరోజు వైస్ కళ్ళల్లో ఇది కాదు వాదించలేని నిస్సహాయత కనిపించింది.

    ఏచూరి చెప్పేది స్పష్టంగా వుంది. “ప్రభుత్వాన్ని పడగొట్టడం మా వుద్దేశ్యం కాదు, 123ని మార్చడమే” అని. అడి గాక ఆయన స్పష్టంగా చెబుతున్నారు కూడా ప్రబుత్వాన్ని పడగొట్టినంత మాత్రాన తదుపరి ప్రభుత్వమూ ఆపని చేయదని గ్యారంటీ ఏముంది అని. ప్రస్తుత ప్రభుత్వంలో వీరికి పాత్ర వుంది గనుక కనీసం ప్రభుత్వం మెడలు వంచి తమకు కావల్సిన విధంగా పని చేయించుకోగల్గుతారు అదే మరో ప్రభుత్వం వస్తే ఆ అవకాశం వారికి వుండకపోవచ్చు. ఇప్పుడు “చేయి” మెలితిప్పి పనిచేయించుకొనే అవకాశం వుండగా ఒకేసారి తల పడగొట్టడం ఎందుకు?

    “మీకు అణు ఒప్పందం అభ్యంతరమైతే దాన్ని ఆపటానికి మీరు బెదిరించినట్లుగానే ఎందుకు మద్దతు ఉపసంహరించుకోరు?” ఈ ప్రశ్నకు సమాధానం ఏచూరి చెప్పేదాంట్లో వుంది. “ప్రభుత్వం పడగొట్టడం మా అసలు వుద్దేశ్యం కాదు” అని.
    వుదాహరణకు: మనం పనిచేసే కంపెనీలో మన పెర్ఫార్మన్స్ బాగా లేదనుకోండి. అప్పుడు మేనేజర్ “మెరుగు పరచుకోకుంటే పీకేస్తాను” అంటాడు. అక్కడ మేమేజరు వుద్దేశ్యం “మెరుగు పరచాలన్నదే” గానీ “పీకేయలన్నది” కాదు గదా? థాపర్ అడ్డంగా “నీవు పీకేస్తానన్నావు గనుక పీకెయ్యి” అంటే అది అడ్డదిడ్డమైన వాదన అవుతుంది.

    ఇక్కడ బెదిరించడం, బెదిరించి అనుకూల పలితాన్ని రాబట్టడం కూడా ఒక చర్యే. చివరికి ఫలితం రానప్పుడు ఆ పనే చేస్తారేమొ!

    థాపర్ ప్రశ్న వేసి అవతలి వ్యక్తికి సమాధానం చెప్పుకొనే సమయం ఇవ్వకుండా అవతలి వ్యక్తికి కోపాన్ని తెప్పించి ఆ కోపం సమాధానం ఇవ్వలేని ఆశక్తత నుంచి వచ్చిందన్నట్లు (కెమెరాను ఆ వ్యక్తి మొహం మీదే పెట్టి) చూపిస్తున్నారు. కానీ చూసేవాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళేమీ కాదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. వికటకవి అన్నారు:

    ప్రసాద్ గారూ,

    థాపర్ కొంచం అతి చేశాడని నేను ఒప్పుకుంటాను. కాని పడగొడతానని ఒక పక్క బెదిరిస్తూ, మరో పక్క పడగొట్టటం మా ఉధ్ధేశ్యం కాదు అంటారేమిటండి బాబూ (కమ్యూనిస్టులూ)? ఇలా అయితే ఎవడు బెదిరేది, ఎవడు లొంగేది? నాకైతే అర్థం కావట్లేదు.

    నిజానికి, ఇది దేశానికి సంబంధించిన చాలా ముఖ్య విషయం. అందరూ జరుగుతున్నదేమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. అదే చర్చలో ఒక పెద్దమనిషి కొన్ని పాయింట్లు చెప్పాడు. ఇతగాడేదో భగవద్గీత చెపుతున్నాడని కాదు గాని, చాలా మంచి పాయింట్స్ లాగాడు. చదవండి.

    “Grilling like that is what Left deserves. Goes on to prove that they do not fully understand what they are talking about but just go on sticking to their guns all the same.
    They say, India will not get access to dual use technologies without modification to US law. Now let me get this straight:
    1) Will India get access to civil nuclear tech under the deal for peaceful purposes? - Yes
    2) Is India getting access to dual use tech now? - No
    3) Is there chance of getting access to dual use tech in future? - Maybe
    4) What is the use of dual use tech (I hope Left knows what it means)? - It can be used for building nuclear weapons as well
    5) So what Left really wants? - Guarantee that India will get dual use tech, meaning it wants India to be “theoritically” able to develop nuclear weapons
    - But hang on, that can’t be right? Did Left not oppose the BJP when it conducted nuclear tests and went absolutely nuts opposing it !!!

    Now I am slightly confused, does Left wants India to develop nuclear weapons or not? If it does, then here India can possibly get dual use tech which can come in handy. So, that’s one point down for Left.
    If it does not wants India to develop nukes, why is it bothered with a provision that US can possibly back out if India conducts a test.

    Guess what, Left should first be cured of its selective amnesia, then make sure they first read the documents and texts fully, understand it, analyse it to find out where it fits in with its ideology and then start debating. Not read the first line and become all hysteric. That’s the sign of teenagers not some mature leader.”

ప్రత్యుత్తరమిమ్ము