రామజన్మభూమిలో రామునికే దిక్కులేదా?

ఈరోజు వార్తల్లో ఈ విషయం చదివితే నమ్మశక్యం కాలేదు. ఒకటికి రెండు పేపర్లు తిరగేసి చూశాక, ఇంత దారుణమా అనిపించింది. రామసేతువు ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే, అసలు రాముడు మరియు రామాయణం(రాముడే లేని రామాయణం ఎక్కడుంది)  ఉనికినే ప్రశ్నిస్తూ మన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం చూస్తే, ఈ కుహానా లౌకిక వాదులు దేశ సంస్కృతిని ఎంతగా మంటగలుపుతున్నారో అనిపిస్తోంది. ఇలా శాస్త్రీయత, ఋజువుల పేరిట తరతరాలుగా మన పూర్వుల నుంచి అందించబడిన శాస్త్రాలు, రాముని పట్ల ఈ దేశ ప్రజలకున్న నమ్మకాన్ని అవమానిస్తే, ఎవడో వేరే అన్యమత దురహంకారి అవసరం లేదు, మనల్ని మనమే త్వరలో భ్రష్టు పట్టించేసుకుంటాం.

 ”But the protests seem to have had no effect on the Central Government. Its counsel on Wednesday told the Supreme Court there was no historical evidence to suggest Ram or the Ram Sethu ever existed. And thousands of kilometres away in Tamil Nadu, the mood was quite the opposite. “

6 స్పందనలు to “రామజన్మభూమిలో రామునికే దిక్కులేదా?”

  1. nenusaitham అన్నారు:

    రాముడు,రామాయణం అంతా మిధ్య.కేవలం సొనియా,క్రాస్ మాత్రమే సత్యం. ఇదే నేటి భారతం.
    -నేనుసైతం

  2. vbsowmya అన్నారు:

    Hm… read about this just now in papers..I am not a very strong believer in Rama janmabhoomi stuff…but, still the whole affair was very shocking to read….. and that too….it came from the central government!!!!

  3. Lalitha Sravanthi అన్నారు:

    Well said sir.

  4. RAMYA అన్నారు:

    అప్పుడే ఏ మైంది ఇంకో 200ఏళ్ళ తరువాత అసలు హిందూ మతమే లేదుఅంతా కల్పితం అంటారేమో.

  5. madhu అన్నారు:

    అప్పట్లొ మన దేశాన్నిపాలించిన రాజులు ఏక్కడ గుడి కనిపించినా దాన్ని నాశనం చేసి వాళ్ళ మతానికి సంబందించిన మందిరాలు కట్టించే వారట. ఇప్పుడు పాలించే వాళ్ళు పురాణాలని తిరిగి రాస్తారేమో.

  6. వికటకవి అన్నారు:

    అందరి వ్యాఖ్యలకి కృతజ్ఞతలు.ఇదంతా మన ఖర్మ కాకపోతే, ప్రపంచంలో ఏ మతం వాళ్ళు చేయని విధంగా మన మతాన్ని మనవాళ్ళే కించపరుస్తూవుంటారు. ఇంతకీ జరిగిన తప్పుని హుందాగా ఒప్పుకోకుండా, మళ్ళీ అందులో రాజకీయం. “మేడం” కలగచేసుకొని “వివరణ” అడిగారట. దానితో మార్పులు చేశార్ట.

ప్రత్యుత్తరమిమ్ము