మన వాళ్ళు ఎప్పటిలాగే అక్టోబరు రెండో తారీఖుని, గాంధీ జయంతి పేరుతో స్వలాభం చూసుకోటంతో మొదలెట్టారు. కాకపోతే, ఈసారి కొంచెం వెరైటీగా గాంధీ గారి మీద మరింత దొంగభక్తితో.
ఇంతకీ విషయమేంటయా అంటే, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదట. అయినా నా పిచ్చి కాకపోతే, ఇస్తే గిస్తే నోబెల్ వాడికి గాంధీ ప్రైజ్ ఇవ్వాలి గానీ, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని అడుక్కోవటమేమిటి? ఇది గాంధీ గారి విలువ మరింత తీసేసినట్లు కాదూ.
అదీకాక, నా సొంత అభిప్రాయం సుమా, బతికున్నప్పుడు లేని గుర్తింపు చనిపోయాక ఇస్తా అనటం మించిన మూర్ఖత్వం ఉంటుందా? అసలు ఇలా చేసే, మన పద్మ అవార్డులన్నిటి విలువ తీసేసారు.
నోబెల్ వల్ల గాంధీ గారికి కొత్తగా ఒరిగేదేమీ లేదు ఈరోజు. ఆయన ఎప్పుడూ “నోబులే”. కొసమెరుపేమంటే, ఇవ్వాళే నోబెల్ వాళ్ళు గాంధీ గారికి నోబెల్ ఇవ్వకపోవటం మా తప్పే అన్నారు. ఏమిటో, ఈ బ్రతిమాలుకుని తెచ్చుకునే కిరీటాలు పెట్టుకునేవాళ్ళకెలా ఉన్నా, విషయం తెలిసిన వాళ్ళకి మా చెడ్డ చిరాగ్గా ఉంటుంది.


1:26 అపరాహ్నం వద్ద అక్టోబర్ 2, 2007
ఆవును, బాగా చెప్పినారు, నోబుల్ (గాంధీజీకి) వాళ్ళకు నోబుల్ ప్రైజ్ అవసరం లేదు, నోబుల్ ప్రైజ్ వచ్చిన ఐన్ స్టీన్, ఆయన జీవితకాలంలో ఒకసారి కూడా ఆ ప్రైజ్ గురించి చెప్పలేదు మరి.
-మరమరాలు
4:32 అపరాహ్నం వద్ద అక్టోబర్ 2, 2007
బాగా చెప్పారు, నోబెల్ ప్రైజ్ గాంధికిస్తే ప్రైజ్ విలువ పెరుగుతుంది అంతే తప్ప గాంధీని నోబెల్ ప్రైజ్ తో కొలవాల్సిన పని లేదు..
1:39 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 3, 2007
నోబెల్, ఆస్కార్, గిన్నిస్… అంతా విదేశీ మోజు. గాంధీ గారు విదేశీ వస్తువుల్ని బహిష్కరిస్తే…విదేశీ..ని ఆయనకు తొడిగే ప్రయత్నం… విడ్డూరం.
4:00 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 3, 2007
ప్రైజులిచ్చేదే గుర్తింపుకోసం
గాంధీకి గుర్తింపు అవసరమేముంది.
గాంధీ పేరే ఒక పెద్ద గుర్తింపు.
దాన్నడ్డుపెట్టుకొనే కధా తరతరాలుగా దేశాన్ని పీడించుకు తింటున్నారు…
12:16 అపరాహ్నం వద్ద అక్టోబర్ 4, 2007
కరక్టే..గంధీజీ కి నోబుల్ ప్రైజ్ ఇస్తే
నోబుల్ వాళ్ళకి గుర్తింపు వస్తుంది.