ఓ సరికొత్త మనసు - పుస్తక సమీక్ష

నే మాట్లాడే పుస్తకం ఓ ఇంగ్లీష్ పుస్తకము, A Whole New Mind By Daniel Pink.

ప్రపంచీకరణతో మనం ఇన్నాళ్ళూ వర్ధమాన దేశాలకు కలిగే కష్టనష్టాలు మాత్రమే చదివాము, విన్నాము. కానీ, ప్రపంచీకరణతో  వల్ల యూరోపు,అమెరికాలు కూడా దెబ్బతింటున్నాయి. ఉదా: అవుట్ సోర్సింగ్ లాంటివి…

ఇది ముఖ్య విషయముగా వచ్చిన పుస్తకమే డేనిఎల్ పింక్ రాసిన A Whole New Mind. ఆసియా దేశాలకు ఉద్యోగాల వలసతో బాగా నష్టపోతున్న అమెరికా వంటి దేశాలు భవిష్యత్తులో మరింత నష్టపోకుండా ఏమి చెయ్యాలన్నది సైన్స్ పరముగా కూడా పరిశీలించిన ఈ పుస్తకం మంచి ఆసక్తికరముగా ఉందనటములో సందేహం లేదు.

ఈనాటి సమాచారయుగంలో (Information Age) కీలక పాత్ర వహిస్తున్న ఎడమమెదడు(Left Brain) చేసే పనులయిన Logic, Analysis & Sequence స్థానంలో కుడిమెదడు చేసే పనులయిన simultaneous, contextual, big-picture capabilities  మాత్రమే రాబోయే భావసంకల్పయుగం(Conceptual Age)లో కీలక పాత్ర వహిస్తాయి అని పింక్ చెబుతాడు. ఎవరయితే సమాచారయుగం నుంచి భావసంకల్పయుగం దిశగా ఎంత త్వరగా వెళుతారో, వారిదే రాబోయే కాలం. లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనులన్నీ ఇప్పుడు వర్ధమాన దేశాలకు అవుట్ సోర్స్ రూపంలో వెళ్ళిపోటం వల్ల (ఇది పెరగటమే తప్ప తరిగేది కాదు), రైట్ బ్రెయిన్ పనులయిన వంటి వాటిపై ఈ దేశాలు దృష్టి పెట్టాలని చెప్తాడు. అలానే రచయిత బానే కష్టపడ్డాడనుకుంటా విషయసేకరణ కోసం. ఇండియాలో సాఫ్టువేరు ఇంజనీర్లని కలవడం, లాఫింగ్ క్లబ్బు (ముంబాయి) కెళ్ళటం లాంటివి.

Left Brain చేసే పనులు ఇవి.  
uses logic,detail oriented,facts rule,words and language,present and past,math and science
can comprehend,knowing,acknowledges order/pattern perception, knows object name
reality based,forms strategies, practical, safe

Right Brain చేసే పనులు ఇవి.
Uses feeling,”big picture” oriented,imagination rules, symbols and images, present and future, philosophy & religion, can “get it” (i.e. meaning) believes appreciates spatial perception, knows object function, fantasy based, presents possibilities impetuous,
risk taking

ఈ దిశగా Six Senses అని ఆరు సూత్రాలు ప్రతిపాదించాడు.

- Design: going beyond the utility of your skill set to its significance and emotional appeal;
- Symphony: considering how your combined competencies and attributes contribute to your unique promise of value;
- Story: crafting messages to clearly communicate what you offer;
- Empathy: building a network of mutual benefit with others;
- Joy: identifying work you love where you can be yourself;
- Meaning: making a difference in the lives of the people you serve.

అంటే, Right Brain పనులు ఆసియా దేశాలకు తెలియదా అన్న ప్రశ్న రావొచ్చు.  కానీ సృజనాత్మకత, రీసెర్చ్ లాంటి వాటి మీద ఆసియా దేశాలు పెట్టుబడి పెట్టగలవా అన్నది పెద్ద సమస్య. గతాన్ని పరిశీలిస్తే, ఇతరులు కనిపెట్టినవాటిని  Re-Produce చెయ్యటము ద్వారా ఆసియా దేశాలు పారిశ్రామికంగా ఆధారపడినాయి కదా.

ఈయన చెప్పింది నిజమే, ఎంచేతంటే కళలన్నీ  Right Brain పనులే.  అందుకేనేమో, వాళ్ళు (మంచి కళాకారులు) ఎప్పటికీ డిమాండే.

ఈ సందర్భములోనే అలానే మెదడును గూర్చి కొన్ని మంచి సమాచారము కూడా ఇచ్చాడు. ఇవి చదవండి.

The left hemisphere controls the right side of the body;
the right hemisphere controls the left side of the body;

The left hemisphere is sequential;
the right hemisphere is simultaneous;

The left hemispehere specializes in text;
the right hemisphere specializes in context;

The left hemisphere analyzes details;
the right hemisphere synthesizes the big picture;

The left hemisphere is the thousand words;
the right hemisphere is the picture;

అలాగే అంతర్జాలంలో ఈ చిన్నపాటి పరీక్ష వెతికి పట్టా. దీని ద్వారా మీరు ఏ మెదడు ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులో తెలుస్తుంది. పుస్తకం మరీ పెద్దది కూడా కాదు. ఓ ప్రయాణంలో ఈజీగా చదివేయొచ్చు. దాదాపు ఓ రెండు వందల పేజీలనుకుంటా.  

అమెజాన్ లో ఈ పుస్తకం దొరుకుతోంది.
 

7 స్పందనలు to “ఓ సరికొత్త మనసు - పుస్తక సమీక్ష”

  1. వైజాసత్య అన్నారు:

    అనుకుంటాము కానీ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. అందరినీ పరిగెత్తించేదే ప్రపంచీకరణ. కాదూ, కూడదు అంటే వేరే చెప్పక్కర్లేదు..

  2. వికటకవి అన్నారు:

    వైజాసత్య గారు,

    అవును, మీరన్నది అక్షరాల నిజం, ఎవడి కష్టాలు వాడివే. మునిగినవాడికే కదా లోతు తెలిసేది. ధన్యవాదాలు.

  3. cbrao అన్నారు:

    ప్రపంచీకరణ తో అభివృద్ధి చెందిన దేశాలకు తిప్పలన్న ఈ అంశం నవీనంగా ఉంది. ఈ అంశమే ఈ పుస్తకం బలం.

  4. వికటకవి అన్నారు:

    అవును రావు గారు. నాకు నచ్చినదేమంటే, ఉద్యోగాలు పోతున్నాయని ఏడుస్తూ కూచోకుండా, క్రొత్త పంథాను అనుసరించి ఇతరులను ఎదుర్కో అని తన వాళ్ళకు చెప్పటం. ఇక్కడ చెప్పటం సాధ్యం కాదు గానీ, సోదాహరణంగా పింక్ బాగా చెప్పాడు.

  5. budaraju aswin అన్నారు:

    సీత కష్టాలు సీతవి
    పీతకస్టాలు పీతవి

  6. నాగరాజా అన్నారు:

    మెదడును అన్ని దిశలా ఉపయోగించడం వల్ల ప్రస్తుతానికి, భవిష్యత్తుకు ఢోకా ఉండదు!? ఆరు సూత్రాలు బాగున్నాయి.

    థాంకునెనరులు

  7. వికటకవి అన్నారు:

    అశ్విన్ మరియు నాగారాజా లకు నెనర్లు.

ప్రత్యుత్తరమిమ్ము