రాముడెప్పుడూ మంచి బాలుడే
రానారె గారు రామాయణం ఈ కాలానికి ఎలా వర్తిస్తుంది అని అడిగారు. పెద్దగా విశ్లేషణలేకుండా సరళంగా చెప్పటానికి నాకు స్వదేస్ లో ఈ కింద పాట బాగా నచ్చింది. ముఖ్యంగా,
मन से रावण जॉ निकाले, राम उस के मन मे है
అన్న వాక్యం. అదంత సులభం కాదన్నది వేరే విషయం అనుకోండి, కానీ ప్రయత్నించటంలో తప్పులేదు. చిన్న వాక్యమైనా, చాలా ఉత్తేజపరుస్తుంది.
రెండోది, ఈ లంకె. సమకాలీన దృక్పధంతో కూడిన విశ్లేషణ. నాకు ఇది కూడా బాగా నచ్చింది.
మూడోది ఈ పుస్తకం.
అయినా, రాముడు మంచి బాలుడు అంటూనే, అందులోనే మళ్ళీ శ్లేషగా వీడు ఈ కాలానికి తగ్గవాడు కాదు అని చెప్పటానికి ఆ మాటవాడినప్పుడే, మనం రాముడికి దగ్గరవటానికి ఎంత భయపడుతున్నామో తెలుస్తూనే ఉంది కదా.


8:35 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 27, 2007
రెండో లంకె చాలా బాగుంది. నెనర్లు. ఒకసారి పైపైన చదివాను. అర్ధం చేసుకోవటానికి ఇంకో రెండుసార్లైనా చదివాలి
11:07 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 27, 2007
The first link given by u is truly inspiring.
I think I need it and most of my frens as well.[:)]
Didn’t read the book.
Thanks alot for the link on Sita.
11:38 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 27, 2007
@అరుణ గారు,
నాకు సీతతో పాటు రాముడి గూర్చిన వివరణ కూడా నచ్చింది. రాముడి గొప్పతనం అంతా ఒప్పులు చేయటం కాదు, ఒక సామాన్య మానవుడిలా జన్మించి, ప్రలోభాలెదురైనా లొంగగ ముందుకు సాగటమే అన్నది. మరొకటేమంటే, రాముడు అనగానే, ముందుగా అందరూ దేవునిగా ఊహించేసుకొని, అలాంటి వాడు సీతని ఎలా అనుమానించాడు….. లాంటి వాటిమీదకి దూకేస్తారు. ఆయన ముందు మానవమాత్రుడు, కొన్ని తప్పులు చేశాడు మానవమాత్రుడిగానే, కానీ వాటిని గుర్తించి, పశ్చాత్తాపపడి, సరిదిద్దుకోవటం ద్వారా దేవుడు అయ్యాడు, అన్నది కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే తప్ప తెలియదు.
@రవి గారూ, అవును ఒకటికి రెండు సార్లు చదవదగ్గ విషయమే అది.
12:50 అపరాహ్నం వద్ద నవంబరు 2, 2007
rAmuDevaru, rAvaNuDevaru anna vishayam gurinchi teluglO sItArAmaSAStri gAru kUDA abdhutamgA vrASina pATa undi. ‘SrI AnjanEyam’ sinima lOni ‘tikamaka makatika parugulu eTukEsi’ anna pATa.
SrIrAmachanduruNNi kOvello khaidu chEsi
rAkAsi rAvaNunni gunDellO koluvu chEsi
talatikkala bhakti tO taitakkalA… manishI..