ప్రాయోజితాలు – పేరడీలు

చార్మినార్ యాస్బెస్టాస్ సిమెంట్ రేకులు పేరడీ

ఏంటి రాజశేఖర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?

ఆ ఏమీలేదు జెన్నా, మా బ్రాహ్మిణి స్టీల్ పైకప్పుకి డబ్బులు ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నాను.

హిహిహి..(వెర్రి నవ్వు) ఇందులో పెద్దగా ఆలోచించటానికేముంది? ఒకటో రెండో ప్రభుత్వ పథకాలు అమ్ముకుంటే సరి. నేను గతంలో ఇలానే అమ్ముకొని చాలా పైకప్పులు వేసుకొన్నాను.  మా తాతగారు ఇలా సంపాదించిన డబ్బు ఇంకా చెక్కు చెదరలేదు.

అలాగా, నిజమే. నువ్వు చెప్పినట్లే మన ప్రభుత్వ పథకాలు అమ్ముకొని, మా బ్రాహ్మిణి స్టీల్  పైకప్పు వేయించుకుంటా.

ఆంధ్ర ప్రభుత్వ పథకాలు, భారత దేశములో అత్యధికముగా దోచుకోబడుతున్న పథకాలు. దోచుకొనే వివరాలకు … ప్రభుత్వములోని ఏ రాజకీయ నాయకుణ్ణయినా సంప్రదించగలరు.

**************************************************************
లైఫ్ బాయ్ పేరడీ

దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్
కాంగ్రెస్ ఎక్కడ ఉందో దోపిడీ అక్కడ ఉందీ… కాంగ్రెస్

నీతిని 100% అంతం చేసి, నాణ్యమయిన అనినీతిని ఇచ్చేది కాంగ్రెస్

***************************************************************

ఉడ్వర్డ్ గ్రైప్ వాటర్ (పాప ఏడ్చింది) పేరడీ

మేడం : గుర్ర్ర్ర్…గుర్ర్ర్ర్ర్…గుర్ర్ర్
యువనేత : ఏమైంది?
కార్యకర్త : మేడం అలిగింది
యువనేత : ఉండు. చొంగ కార్చి, సూట్ కేసిచ్చొస్తా!
నేత తండ్రి : ఎ..వ..రు….అ..ది
యువనేత : మేడం అలిగింది
నేత తండ్రి : చొంగ కార్చి, సూట్ కేసిచ్చిరా. మా కాలంలో మేమదే చేశాం!
నేత తాత : ఎ..వ..రు….అ..ది
నేత తండ్రి : మేడం అలిగింది
నేత తాత : చొంగ కార్చి, సూట్ కేసిచ్చిరా. మా నాన్న అలానే చేసేవాడు.
నేత తాత తండ్రి : ఎ..వ..రు….అ..ది
…………………….
………….

24 స్పందనలు to “ప్రాయోజితాలు – పేరడీలు”

  1. విహారి అన్నారు:

    Adirindi

  2. దిన్నిపాటి శివకుమార్ అన్నారు:

    హహ్హ చాలా బాగా రాశారు.

  3. Giri అన్నారు:

    మంచి నవ్వులాట మాటలు రాసారు; నవ్వులాగ లేదు నాకు చదివి; మీరు ఇట్టి గొప్ప పేరడీలు మరికొన్నిటిని రాయవలెనని మనవి. ఉంటాను.

  4. ప్రవీణ్ గార్లపాటి అన్నారు:

    చాలా బాగా రాశారు పేరడీలు…

  5. నాగరాజు అన్నారు:

    చార్మినార్ ఏస్బెస్టాస్ రేకులమీద, యూనివర్శిటీలో ఉన్నప్పుడు, మా జూనియర్ ఒక పారడీ కట్టాడు – మా తాతగారింటించిన చుట్ట ఇంకా ఆరలేదు అని. ఈ రేకుల ప్రసక్తి వచ్చినప్పుడల్లా, నాకు వాళ్ల తాతగారి చుట్టే గుర్తుకువస్తుంది :-)

  6. నేనుసైతం అన్నారు:

    10/10
    అక్షరాలా సత్యం…వికటకవి!

  7. Raj అన్నారు:

    చాలా బాగుందండి. మీరు మరిన్ని పేరడీలు వ్రాయాలని ఆశిస్తున్నాను.

  8. చదువరి అన్నారు:

    చప్పట్లు!

  9. కొత్తపాళీ అన్నారు:

    పెట్టుకున్న పేరు సార్ధక మనిపించుకున్నారు

  10. వికటకవి అన్నారు:

    మొదటిసారి అడుగిడినవారికి స్వాగతం. అందరికీ నెనర్లు. @విహారీ, నా వ్యాఖ్య కత్తిరింపుతో నాకు తలుపులు మూసావేమో అనుకున్నా. బహుశా నే పొరబడ్డానేమో. ఏదేమైనా తమరి రాక ఆనందమే.

  11. braahmii అన్నారు:

    Adirindi,హహ్హ చాలా బాగా రాశారు,చాలా బాగా రాశారు పేరడీలు చప్పట్లు!
    అన్నీ

    హహ్హ హహ్హ హహ్హ హహ్హ

  12. చంద్ర శేఖర్ కాండ్రు అన్నారు:

    మీ పేరడీలు బావున్నాయి

  13. Solarflare అన్నారు:

    *Applause*Applause*

    *encore*

  14. ramya అన్నారు:

    బావుంది.tv9 లో ఓ వికటకవి వస్తుంటాడు అతడికి పెద్దన్న లా వున్నాడే మీ వికటకవి.

  15. విహారి అన్నారు:

    నేను మీ వ్యాఖ్యను కత్తిరించానా? అదెక్కడ?

    నా బ్లాగులో తొలగించిన వ్యాఖ్యలు రెండే రెండు. అది కూడా ఓ ఏడెనిమిది నెలల క్రితం.

    – విహారి.

  16. వికటకవి అన్నారు:

    @విహారి,

    హిట్ట ఫట్టాలో, ఓ లింక్ పెట్టా నా అభిప్రాయమంటూ ఓ బుల్లి కామెంట్. అది కొద్దిసేపు బతికి తరవాత చచ్చిపోయింది. దాంతో, మూడోకన్ను తెరిచారేమో అని మళ్ళీ కామెంట్స్ రాయలా, టపాలు మాత్రం చదువుతూనేఉన్నా :-( ఇప్పుడు లైన్ క్లియర్ కాబట్టి చూస్తూ రాస్తూ ఉంటా.

  17. విహారి అన్నారు:

    మీరు లంకె ఇచ్చింది. ప్రభుత్వ కప్ ట్వెంటీ/ట్వెంటీ-11 టపా కి. అది భద్రంగానే వుంది.

    అదన్న మాట సంగతి.

    అయినా మీ అభిప్రాయం మీరు చెప్పారు. అంతే గదా :-)

    – విహారి

  18. వికటకవి అన్నారు:

    @విహారీ, నాదే పొరబాటు. కానీ ఒక టపా కామెంటు మరో టపాలో ఎలా రాశానో నాకే తికమకగా ఉంది. ఏదేమైనా, క్షమాపణలు.

  19. రాఘవ అన్నారు:

    మనకి స్వతంత్రం వచ్చింతర్వాత కాంగ్రెస్ చేసిన మంచిపనులేఁవైఁనా వుంటే వాటిపైకూడా వొక పేఁరడీ వ్రాయండి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ల వోట్లు కూడా పడతాయ్ మీకు. అయ్యయ్యో, భూతద్దం పెట్టి వెతికినా నాకేఁవీఁ కనబడలేదంటారా? అయితే దానికి కూడా వొక మార్గముందండోయ్… వాళ్ల “యెగస్పార్టీ”వాళ్లు చేసిన తప్పులపై వ్రాస్తే సరి!

    పైన చెప్పినదాని సంగతెలావున్నా మీరువ్రాసిన యీ పేఁరడీలకి మాత్రం “హాస్యాదుదరఖండనసామర్థ్యం” కొంచెం యెక్కువే. ఏఁవైఁనా ‘వికటకవి’ పేరు సార్థకం జేస్కున్నారు.

  20. వికటకవి అన్నారు:

    రాఘవ గారూ, స్వాగతం నా గూటికి. ధన్యవాదాలు. కాంగ్రెస్, నేను ఆమడ దూరం. మీరన్న మంచిపనులు చేసే కాంగ్రెస్ బహుశా నే పుట్టకముందే కడతేరిందేమో! ఈనాటి కాంగ్రెస్ హయాంలో ఉన్న ఒకే లాభమల్లా చేయి తడపాలే గానీ, ధైర్యంగా లంచాలు తీసుకుని మరీ పనులు చేసిపెడతారు.

  21. Budaraju Aswin అన్నారు:

    కవి గారు మీరు కాంగ్రస్ కు కూసింత దూరం అనుకుంటాను

  22. వికటకవి అన్నారు:

    అశ్విన్ గారు,

    భూమికి ఆకాశానికున్నంత దూరం అని చెప్దామనుకున్నా, కానీ దూరం నుంచి చూస్తే దగ్గరగా కనిపిస్తాయి కదా.. అదీ ఇష్టం లేదు. అందుకని, తూర్పు పడమర అనుకోండి.

  23. ప్రాయోజితాలు - పేరడీలు II « వికటకవి అన్నారు:

    [...] ప్రాయోజితాలు – పేరడీలు II మీరు గతంలో చూడనట్లైతే, మొదటి టపా ఇక్కడ చూడవచ్చు. [...]

  24. రానారె అన్నారు:

    సూపరు! :D

ప్రత్యుత్తరమిమ్ము