ఇదెక్కడి సౌభాగ్యం?
సౌ అంటే వందట…ఛా… మంచి భాగ్యాన్ని కాస్తా వంద భాగ్యాలు చేసేసారు.
తెలిసిందల్లా, ఇదే సౌభాగ్యమయితే ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదు అని. ఆ యాడ్లో చెప్పించిన విధానం చూస్తే, కొత్తవాళ్ళు అసలు సౌభాగ్యానికి అదే అర్థమనుకున్నా ఆశ్చర్యం లేదు.
మరయితే, (దో)శ అంటే రెండుశ అనీ, (చే)దు ని ఆరుదు అనీ, (నౌ)కరుని తొమ్మిదికరు అనీ అనొచ్చనమాట. భలే ఉన్నాయి కదూ ఈ కొత్త పదాలు.


11:43 అపరాహ్నం వద్ద డిసెంబరు 12, 2007
భలే చెప్పారండి.
2:49 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 13, 2007
బాగా చెప్పారు…..ఎవరో మహనుభావుడు దీనిని వ్రాసింది…….వాడు మీకు తెలిస్తే ‘సౌ’ చెప్పు దెబ్బలు ఫ్రీ అని చెప్పండి. అసలే కుంటుతున్న భాషని వీడి లాంటి వాళ్ళు మొత్తం నాశనం చేసేస్తున్నారు……
3:20 అపరాహ్నం వద్ద డిసెంబరు 13, 2007
@అశోక్, @రాజ్ కృతజ్ఞతలు. భాషని కంపు చేయటం పక్కనపెట్టండి. బంగారం లాంటి పదాల అర్థాలు మార్చేయటం దారుణం. అదీ ఏదో హాస్యానిక్కాదు, నిజమే అన్నట్టు చెప్పటం.
7:41 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 14, 2007
pathetic,
They do not even know the meaning of their own brand name!
What a punk ass !
3:47 పూర్వాహ్నం వద్ద జనవరి 3, 2008
ఆ మధ్య ఒక పెళ్ళి పత్రిక చూసాను అది ఇంగ్లీష్ లో వుంది. వాళ్ళు రాసారు
chi. sow. bride-name.
వాళ్ళకి అనే SOW పదానికి డిక్షనరీ మీనింగ్ తెలీదనుకుంటా.
SOW = ఆడ పంది
తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ లో పత్రిక చేయించుకునేటపుడు కనీసం ఈ మాత్రమైనా చూసుకోనక్కర్లా? లేదంటే సుబ్బరంగా తెలుగు లో పత్రిక చేయించుకోవచ్చు గా!!
2:33 అపరాహ్నం వద్ద జనవరి 3, 2008
అమ్మో చావగొట్టారండి బాబూ, ఆడ పందే
ఈ విషయానికి ప్రాచుర్యం కల్పించినట్లయితే, చస్తే ఎవడూ అనడు మళ్ళీ Sow అని.
2:42 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 6, 2008
ఇంత మంచి మంచి విషయాలు విశేషాలు చెప్తున్నందుకు మీకు మా ‘సౌ’నాలు..అబ్బ అదేనండీ వందనాలు…అర్ధం చేస్కోరూ…
ఇంకా నయం.. నయన్ తార అంతె తొమ్మిది తారలనీ..దోమ అంటె రెందు “మ” లనీ(అదేనండీ ముక్కు పట్టుకుని అంటామే అదన్న మాట) కూడా చెప్పేస్తారు