దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం గూర్చి కొత్తగా చెప్పేదేముంది.  వారి సినీగీతాలు “మేఘమాల” అన్న పేరుతో ఓరియంట్ లాంగ్మన్ వాళ్ళు 1996 లో ప్రచురించిన పుస్తకం నా కంటపడింది. వాటిల్లో మనం వినని పాటలు తక్కువే. నాకు ముందుగా పాట నచ్చి తరువాత ఆయన రాసిన పాటే ఇది అని తెలిసినప్పుడు, ఈ పాట ఆయనది అవటములో ఆశ్చర్యమేముంది అనిపించాయి. మచ్చుకు కొన్ని తగు విరామముతో ఇక్కడ పరిచయం చేస్తాను. ముందుగా, ఇది

సినిమా : భాగ్యరేఖ
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి

నీవుండే దా కొండపై
నాస్వామి, నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో||

 ……………………

9 స్పందనలు to “దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం”

  1. కొత్తపాళీ. అన్నారు:

    Beautiful!
    One of my alltime favs!!

  2. sUryuDu అన్నారు:

    నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం, పంచుకున్నందుకు ధన్యవాదాలు :-)

    నమస్కారాలతో,
    సూర్యుడు :-)

  3. పరుచూరి శ్రీనివాస్ అన్నారు:

    మీకు తెలియకపోదు. పాటల సాహిత్యంపై ఆ రచయిత/రచయిత్రులకు (లేక వారి వారసులకు) కాపీరైటు హక్కులుంటాయి. మీరు పైన చెప్పిన పుస్తకం మొదట 1975 లోను, ఆ తర్వాత 1996 లోను ప్రచురించబడింది. హక్కులు కృష్ణశాస్త్రిగారి అబ్బాయి: బుజ్జాయి గారివి. గమనించగలరు.

    శ్రేయోభిలాషి,
    శ్రీనివాస్

  4. వికటకవి అన్నారు:

    శ్రీనివాస్ గారు,

    మంచి మంచి పాటలు, ఏదో అందరితో కలిసి పంచుకోవాలన్న కుతూహలం తప్ప మరేమీలేదు. నిజానికసలు నేను కాపీరైటు దృష్టితో ఆలోచించలేదు. కానీ మీరు చెప్పినదీ నిజమే. సాహిత్యం తొలగిస్తున్నాను. ఆసక్తి గలవారు నన్ను సంప్రదించగలరు.

  5. Netizen అన్నారు:

    @వికటకవి గారు, ఇది మరీ దారుణం. “ఆసక్తి” ఉన్నవారికి దొంగతనంగా పంచుతారా? :)

  6. వికటకవి అన్నారు:

    మీరలా పదాలతో ఆడుకుంటే, నేనూ ఆడుకుంటాను నెటిజెన్ గారూ. సంప్రదించమన్నాను గానీ, పంచుతానన్నానా? :-)

    ఇందు మూలముగా సమస్త జనులకు తెలియజేయునదేమనగా, ఆసక్తి గలవారు “మేఘమాల” ను కొని చదువుకొనగలరు. ఖండాంతరాల్లో ఉన్నాము మా గతేం కాను అంటే …. ప్రస్తుతానికి మీకు పస్తే. నాకు తెలిసి పుస్తకానికి కాపీరైటు 50 ఏళ్ళు చివరి ప్రింటయినప్పటినుంచి. అప్పుటిలోపల మళ్ళీ ప్రింటు కాకపోతే, ఈ అర్భకుడు ఇంకా ఈ భూమ్మీదుంటే, అప్పుడు చూద్దాం.

  7. నిషిగంధ అన్నారు:

    అద్బుతమైన పాటండి! వీడియోతో సహా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!

  8. vookadampudu అన్నారు:

    కొన్ని జాతిసంపదలు.. జాతీయసంపదలు కూడా..
    ఆధునిక శకం లో సుబ్బులక్ష్మి గారి సుప్రభాతాన్ని, త్యాగరజ కీర్తనలనీ కాపీరైటు మాదంటే మాదని అమ్ముకోవటం, జనాలకి దూరం చేయటం విచారకరం. ఇటీవల, గుంటురు శేషేంద్ర శర్మ గారు కీర్తిశేషులైన తర్వాత, “వారి రచనలపై సర్వ హక్కులు మావి” అని రెండు వర్గాలకు చెందిన ప్రకటనలు చూశాను. విధి అంటే ఇదేనేమో.
    ఏమైన మంచి పాటను పునః పరిచయం చేశారు సంతోషం. ఆ
    రోజుల్లో సినిమాలలో మంచి భక్తి సాహిత్యం వచ్చేది, ఈ పాటా, దేవ దేవ ధవళాచల మందిర, శ్రీ లలితా శివజ్యోతి మున్నగునవి. కలి ప్రభావం చేత, ఇప్పుడు సినిమాలల్లో “భక్తి” పాటలకు కూడా, బూట్లు జీన్సు వేసుకొని గెంతులువేస్తున్నారు.

    ఆ ఏడుకొండలవాడు మీకు దీర్ఘాయువివ్వాలని కోరుకుంటూ…

  9. వికటకవి అన్నారు:

    @ఊకదంపుడు,

    మీ శుభాశీస్సులకు ధన్యవాదాలు.ఆ పుస్తంకంలో పాటలన్నీ అలాంటివే. అయినా ఇలాంటి పాటల సాహిత్యం ఒకటి రెండు సార్లు వింటే నోటికే వచ్చేస్తుంది. ధారణకి కాపీరైటు వర్తించదనే అనుకుంటా :-)

ప్రత్యుత్తరమిమ్ము