కవిత్వం - నిర్వచనాలు
- కవిత్వం అబద్దానికి పుట్టిన ఆడపిల్ల — అజ్ఞాతకవి
- పదములతో భావనకు భ్రాంతి కలిగించుటయే కవిత్వం — గోల్డ్ స్మిత్
- నగ్నసత్యం వేదాంతం, అలంకృత సత్యం కవిత్వం — బోయి భీమన్న
- బాధ నుంచి ప్రభవించు కవిత, అందుకే అక్షరమ్ము రాక ఐతి కవిని — ఆరుద్ర
- సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ దొర్లిపడు కొండధార మాడ్కి
సహజకవిత బయలపడి సన్నుతిగను — ఆదిభట్ల నారాయణదాసు - కవిత్వం ఒక మెరుపు, కాదది పొడి మాటల కూర్పు — ఖలీల్ జిబ్రాన్
- మనసు మల్లెపొదల్లోంచి పసందైన వాసనలు వీచి,
అవి పద్యాల సీసాల్లో అనంతకాలం నిలిస్తే కవిత్వం — దాశరధి - అగ్ని జల్లినా అమృతం కురిసినా , అందం ఆనందం దాని పరమావధి — తిలక్
- కల నిజపరచటం కాదు కవిత్వం
నిజాన్ని కలగనడమే దాని తత్వం — ఆరుద్ర - ఆవేశమప్రయత్నముగా మూర్తీభవించియుండు పదములును, భావములునూ గాక కవిత్వమనగా ఇంకేమి? — జాన్ స్టువర్ట్ మిల్
- కప్పిచెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శనం — సినారె
- గొప్ప కవిత్వం ప్రధాన లక్షణమేమంటే, ఎవరి తాహతును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని అందించగలగటం — చలం
- అన్య భాషల్లోకి అనువదించటం సాధ్యం కానపుడే అది గొప్ప కవిత — బేకన్
- నాగరికత అభివృద్ధి చెందినకొద్దీ కవిత్వం దాదాపు తప్పని సరిగా క్షీణిస్తుంది — మెకాలే
- అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రోజైక్ భావం పోయట్రీ అవదు. కవిత్వం ఒక అల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు — తిలక్
12, 13 నిర్వచనాలు నాకు బాగా నచ్చాయి, కానీ 14 లో మొదట నాగరికతకీ, కవిత్వానికి లంకె నేరుగా ఎందుకు పెట్టాడో అనిపించింది. బహుశా, ప్రకృతితో నాగరికతని ముడిపెట్టి, తరిగిపోయే ప్రకృతి సంపదతో పాటే కవిత్వం కూడా నశిస్తుందన్నాడేమో. ప్రకృతి లేని కవిత్వమేమిటి, అవును నిజమే, కానీ అది పాశ్చాత్యులకు నప్పుతుందేమోగానీ, నూటొక్క రకాల కవిత్వాలని కనుక్కొన్న మన వాళ్ళు దీనిని ఒప్పుకుంటారా?
** మన్నవ గిరిధరరావుగారి “మణిదీపాలు” నుంచి


3:19 పూర్వాహ్నం వద్ద జనవరి 17, 2008
Naakaite tilak maata istam. Kavitvam oka alchemy.
Kalpana
5:35 అపరాహ్నం వద్ద జనవరి 24, 2008
చలం నిర్వచనం నాకు అర్థమైంది, నచ్చింది.