షరతుల పెళ్ళికొడుకులు - I

గమనిక: ఓ పేరుగాంచిన పెళ్ళిసంబంధాల వెబ్ సైట్లో కొన్ని తమాషా ప్రకటనలు ఇవి.  ఇలా ప్రకటనలివ్వగలిగిన వారి ధైర్యానికి జోహార్లు చెప్పుకుంటూ,  హృదయాంతరాళాల్లోంచి వచ్చిన మాటలు కాబట్టి స్పెల్లింగులు, వ్యాకరణం పట్టించుకోకుండా విషయం చదవండి. ఇవెవర్నీ కించపరచటానిక్కాదు, సరదాగా నవ్వుకోండి అంతే.
*************

I want very simple girl. from brahmin educated family from orissa state. he is also know about
RAMAYAN, GEETA BHAGABATA, and other Homework.

వీడి ధైర్యం దొంగలెత్తుకెళ్ళ. రామాయణం, గీత చదివి వినిపించింది చాలక, అంట్లు కూడా కడుగే అమ్మాయి కావాలి అని నైసుగా “హోం వర్క్” అంటున్నాడు. ఏ సంధ్య గారో, పుణ్యవతి గారో చూస్తే వీడి గతేం కాను?  ఆ మాట కొస్తే మన బ్లాగ్వనితల పాల్పడినా వీడి పని అంతే :-)

Wants a woman who knows me better and can adjust with me forever. She may never create any difficulties in my life or her life by which the entire life can run smoothly. thank you  

వీడు సరేసరి, నేను మారేది లేదు, నన్ను జీవితాంతం సర్దుకు పోయే అమ్మాయి కావాలని ఇప్పుడే ఘంటాపదంగా చెబుతున్నాడు. అంతటితో ఆగాడా, ఉహూ, తనకే కష్టం కలిగించగూడదుట, మరి వీడి సంగతో? వీడి ప్రకటన వీడి మెడకి తగిలించి, కోఠీ ఉమెన్స్ కాలేజీ ముందు నిలబెడితే వీడి పరిస్థితేమిటా అని ఆలోచిస్తున్నా…

She should be good looking and should have a service. She Shoulsd have one brother and one sister. She should be educated.

అందగత్తెట, సరే ఒప్పుకుంటాం కానీ మళ్ళీ వీడు సర్వీస్ అంటున్నాడు. ఇదీ అంట్లు తోమే పని కాదు గదా? భలే పదాలు కనిపెడుతున్నారే. సరే అదీ సర్దుకుపోయే అమ్మాయి దొరికిందనుకో, మళ్ళీ ఒక్క తమ్ముడు, ఒక్క చెల్లెలే ఉండాలిట. ఇదెక్కడి ఫిట్టింగు? పోనీలెండి , నేను అమ్మాయి తరఫు మరో ఇద్దరిని పోషిస్తా అంటున్నాడేమో. ఏమో నమ్మేట్టులేదు, వాళ్ళిద్దర్నీ పన్లో అదే సర్వీస్లో పెడతాడేమో? మరిచా, చివర్లో చదువుకున్నదయి ఉండాలంటున్నాడోచ్!

I am a happy-go-lucky kind of person. Enjoys every moments of life. I love to make friendship. Becauese friendship is a first step of love. I am looking for my dreamgirl who will love me more than i. Because i love myself a lot. If u think that is u then why to late come on …….. hold my hand forever !!!

స్నేహం ప్రేమకి పునాది తో మొదలెట్టాడు. అనుమానం లేదు, వీడు “దిల్వాలే దులహనియా లేజాయేంగే” ఓ పది సార్లు చూసుంటాడు.

i am simple boy.I have lot of problem in mylife because of my luck. now i am looking one girl. she care me and love me lot lot lot.

వీడు భలేగా నచ్చాడు నాకు, వీడి ధైర్యానికి. బహుశా “కార్యేషు దాసీ…” బాగా వంటపట్టించుకున్నట్లున్నాడు. నేను కష్టాల్లో మునిగున్నాను, వచ్చి నాకు సేవలు చేసి తరించమని నిర్భయంగా చెబుతున్నాడు.  వీణ్ణి గానీ మన తెలంగాణా శకుంతల చూస్తే, పిచ్చకొట్టుడే :-)

My wife should be as ‘Parwati’ as in Kahani Ghar Ghar Ki and as Tulsi as in KSBKBT……

ఇహ వీడి గురించేమని చెప్పను. వీడు నేరుగా స్పెక్స్ (Specifications) ఇచ్చేశాడు. ఈ ధారావాహికాలు నేను చూడలేదుగానీ, పార్వతీ దేవి మరియు తులసమ్మ (తులసి చెట్టు) కంటే గొప్పవాళ్ళు కాదనుకుంటా. వీడు నిజంగా గుండెలు తీసిన బంటే!

i want a girl with no drinks if she wants she can wear jeans in house but while steping out of house she should give recpect to our cast.

ఈ ప్రబుద్ధుడి కోరికలు విని నా గొంతు మూగపోయి మాటలు రావట్లా. గర్ల్ విత్ నో డ్రింక్సా, అదేదో వాటర్ విత్ నో అయిస్ లాగా.  బాగా జాలిగుండె కాబోలు,  ఇంట్లో జీన్స్ వేసుకోనిస్తాట్ట, కానీ కులానికి మర్యాదివ్వకపోతే, ఖబడ్దార్ అంటున్నాడు. అమ్మో, తేనె పూసిన కత్తే వీడు.

HYE I AM A GOOD LOKING GUY,WHO HAS THE CAPABILITY TO MAKE ANY BODY TO LOUGH.I BELIEVE IN GOD AND ACCORDING TO ME FRIENDS ARE THE REAL MESSENGER OF GOD. THE 3 THINGS I AM LOOKING FROM A GIRL ,THEY ARE
1.THEY MUST BELIEVE IN GOD.
2.THEY HAVE TO LIKE MY PROFFESION
3.SHOULD NOT GET BORED WITH ME WHEN I WILL TRY TO MAKE THEM LOUGH.

వీడు మొదలెట్టటమే కాపిటల్ లెట్టర్స్లో. అంటే, ఒళ్ళు దగ్గరపెట్టి చదవమంటున్నాడు. చచ్చింది గొర్రె. వీడు అందగాడుట, సరే. అందర్నీ నవ్వించగలట్ట, అబ్బో కళాకారుడే. దేవుణ్ణి నమ్ముతాట్ట. మంచి లక్షణమయినవాడికి మల్లేనే ఉన్నాడు కదా. ఆగండి మరి.. వీడు ఓ మూడు షరతులు పెట్టాడండీ అమ్మాయికి. అమ్మాయి కూడా దేవుణ్ణి నమ్మాలిట, బాగుంది. వీడి వృత్తిని అమ్మాయి ఇష్టపడాలిట. వీడు నవ్వించే ప్రయత్నం చేస్తుంటే బోర్ గా ఫీల్ అవకూడదుట. అంటే, నిర్భంధించి నవ్విస్తాడా? ఏమో? ఇప్పుడు నాకు నిజంగానే నవ్వొస్తోంది :-)

whatever she may be but she should feel that she is going to be someone bride and she must think of the future life if she is toolike this she would bde called the lady of the lamp

ఆమె ఎవరైతే నాకేమిటి, తను ఒకడి భార్య కాబోతోందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరికతో మొదలెట్టాడు వీడు. అంతే, ఆ తర్వాత ఈ అర్భకుడికి వీడు చెప్పిన ఒక్క ముక్క అర్థం కాలా. మీకేమైనా తెలిస్తే చెప్పండి, ప్లీజ్… :-(

my name is xxxxx and i am unmarried. please you marrige me pleaes pleaes pleaes pleaes pleaes pleaes pleaes

వీడి పెళ్ళికోసం ఏమైనా చేసేట్టున్నాడు. ఛీ, పెళ్ళి కోసం ఇంతగా మొహం వాచిన వెధవని ఇప్పటిదాకా చూళ్ళా. మగవాళ్ళ పరువు ఇంతగా తీసిన వీడికి ఇదే నా శాపం. ఓ చితక్కొట్టుడు పెళ్ళాంతో వీడికి పెళ్ళి అవుగాక!  :-) అయిదేళ్ళ తర్వాత శాపవిముక్తి.

iam xxxx my family histoy my two brother two sister and fater & mother sister completely marred

పూర్తిగా పెళ్ళిచేసుకోవటమా? అంటే సగం పెళ్ళి అని ఒకటుందా?ఎప్పుడూ వినలేదే? :-(

hello i am a good charactarised man. i want to run my life happily.i divorced my first wife.her charactor is not good’. i expect the good minded and clean habits girl who may be in the same
caste or other caste accepted ..

వీడు మరీ నిజాయితీగా నటిద్దామని, చెప్పకూడనివి కూడా చెప్పేసినట్లున్నాడు.  వీడి నిజాయితీ ఏడ్చినట్టే ఉంది. త్రేతాయుగంలో సీతని అనుమానించిన దేవుడైన రాముణ్ణి ఇప్పటికీ ఆడవాళ్ళు క్షమించట్లా. వీడు పాత భార్య మీద అభాండం వేస్తూ, కొత్త భార్యని వెదుకుతున్నాడు. వీణ్ణి నమ్ముతారంటారా? :-)

వీళ్ళందరికీ “తగిన” భార్యలు ఈ పాటికి దొరికి ఉంటారనే ఆశిద్దాం.ఇంతే కాదండోయ్, ఇంకా ఉన్నారు చాలానే, మిగతా వాళ్ళ గూర్చి మళ్ళీ చెబుతా.

27 స్పందనలు to “షరతుల పెళ్ళికొడుకులు - I”

  1. Nag అన్నారు:

    This article is simply superb.

  2. తెలుగు 'వాడి' ని అన్నారు:

    నవ్వలేక చచ్చాం గదండీ బాబూ …. మీ వ్యాఖ్యానం అదుర్స్… ఇంతకీ ఏ వెదుకులాటలో (స్వ/పర) తగిలాయండీ ఇవన్నీ మీకు … రెండో భాగానికి ఎక్కువగా సమయం తీసుకోకండి …. తొందరగా వదలండి అది మా మీదకు

  3. nagamurali అన్నారు:

    అదరిందండీ ఈ టపా. ఇంత భీభత్సమైన పెళ్ళిప్రకటనలు ఇంతవరకూ చూడలేదు.

  4. సిరిసిరిమువ్వ అన్నారు:

    బాగున్నాయండి ప్రకటనలు. మీరు కూడా ఇలాంటి ప్రకటనలు ఏమైనా ఇచ్చారా!!

  5. teresa అన్నారు:

    Hilarious! :)

  6. వరప్రసాద్ అన్నారు:

    మొత్తానికి మాంచి పెళ్ళి ప్రకటనలు వెతికి పట్టారు, వ్యాఖ్యానం అదిరింది :)

  7. poolavaana అన్నారు:

    చాలా బాగుందండీ

  8. ramya అన్నారు:

    వామ్మో అవన్నీ చదువుతున్నారా? మీ సాహసానికి ఏదోచక్ర బిరుదు ఇవ్వాల్సిందే.
    వ్యాఖ్యానం అదిరింది.

  9. వింజమూరి విజయకుమార్ అన్నారు:

    ఏం నవ్వండీ బాబూ. నవ్వలేక చచ్చాం. చిత్రమైన ప్రకటనలు. అంతకంటే చక్కటి మీ వ్యాఖ్యానం. చాలా బావున్నాయి. కృతజ్ఞతలతో. . .

  10. జ్యోతి అన్నారు:

    శ్రీనివాస్ గారు.

    ఇందులో మీ కోరిక ఏది . నిజంగా చెప్పండి. ఇలాటి కోరికలు ఉన్నాయని తెలిస్తే అమ్మాయిలతో వీర ఉతుకుడే. కోటీ విమెన్స్ కాలేజిలో తెలసందంటే ఉంటుంది గోల. పెళ్ళి మాట దేవుడెరుగు.. అసలే ఈకాలంలో అమ్మాయిలకు చాల డిమాండ్ ఉంది. బ్రహ్మచారులు జాగ్రత్త.. కాస్త అణిగిమణిగి ఉండండి. అమ్మాయిలతో. లేకుంటే నారాయణ ,, నారాయణ అనుకోవాల్సిందే జీవితాంతం.

  11. ravi అన్నారు:

    supar

  12. budaraju.aswin అన్నారు:

    బావుంది రియల్లీ ఎంజాయిడ్

  13. వికటకవి అన్నారు:

    అందరికీ నెనర్లు.

    @ తెలుగువాడిని గారు, రెండో జాబితా వస్తోంది…

    @ సిరిసిరిమువ్వ గారు, నేను ఆ స్టేజీ దాటేసానండీ. ఇప్పుడు నేనే అంట్లు తోముతున్నా :-)

    @ రమ్య గారు, ఓ స్నేహితుడు ఇవి పంపాడు. నా సోది వాటికి జోడించా.

    @ జ్యోతి గారు, ఎంత మాట. అందరు వీరనారీమణుల్ని కోట్ చేసాక అయినా నాకు స్త్రీలంటే ఎంత భయమో వేరే చెప్పాలా? అందుకే నేను మీ పక్షం వహించాను.

  14. షరతుల పెళ్ళికొడుకులు - II « వికటకవి అన్నారు:

    [...] జనవరి 18, 2008 షరతుల పెళ్ళికొడుకులు - II Posted by వికటకవి under నా సోది, నా సోది మరియు సొద, హాస్యం | ట్యాగులు: పెళ్ళికొడుకులు, హాస్యం |    మీరు చదవనట్లైతే, మొదటి భాగం షరతుల పెళ్ళికొడుకులు - I ఇక్కడ. [...]

  15. radhika అన్నారు:

    kevvu …keaka

  16. SIMM31 అన్నారు:

    wonderful comments..

  17. షరతుల పెళ్ళికొడుకులు - II « వికటకవి అన్నారు:

    [...] మొదటి భాగం మీరు చదవనట్లైతే,  ఇక్కడ చూడండి. [...]

  18. వికటకవి అన్నారు:

    @రాధిక,సిం31 లకు నెనర్లు

  19. Ramu అన్నారు:

    వికటకవిగారూ, షరతులేలేని పెళ్ళి కుమార్తెల గురించి కూడా ఒక టపా రాయండి. అదుర్సే అదుర్స్.

  20. రాఘవ అన్నారు:

    whatever she may be but she should feel that she is going to be someone bride and she must think of the future life if she is toolike this she would bde called the lady of the lamp

    అంటే

    ఆమె ఎవరైతే నాకేంటి? మైసమ్మIPS అయినా సరే నాకేంటంట? ఆమె భవిష్యత్తులో ఎప్పటికైనా ఒకడికి పెళ్ళాం అవ్వాల్సిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి (పెళ్లయ్యేవరకే సుమా :P). ఆమెకి ఇది అంగీకారమైతేనే lady of the lamp అదేనండీ “ఇంటికి దీపం ఇల్లాలు” అవుతుంది. :D

  21. వికటకవి అన్నారు:

    @రాఘవ,

    ఆ అనువాదంతో కళ్ళుతెరిపించారండీ. వీడు నిజంగా “మగాడు” కాదు, “ఒక్క మగాడు”.

  22. indianwebdesign అన్నారు:

    ahahaahhaaa
    ohhohhhoohoooooooooo

    abboo ayyoo vaammoo baaboo ….

    navvuku ivi paraakashta le

    chakradhar
    http://www.chakradhar.net

  23. Siri అన్నారు:

    lol - ahahahaha

  24. రానారె అన్నారు:

    రాఘవగారి అనువాదానికి మీ వ్యాఖ్యానం సూపరు. :)

  25. Crossroads » Blog Archive » Telugu Blogs - Jan ‘08 అన్నారు:

    [...] of them. The post has been a huge success going by the number of comments it attracted. Read them here and [...]

  26. పొద్దు » Blog Archive » జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ! అన్నారు:

    [...] మంచి ప్రజాదరణ పొందినట్టే. అ జాబుల్లో ఇది మొదటిది, ఇది [...]

  27. mohanaaaaa అన్నారు:

    kontha kaalam krindata addi vaaram paper lo ee tamashaa prakatana la nu chadivi aananda pade vaani malli gurthuku techhaaru thanks

ప్రత్యుత్తరమిమ్ము