షరతుల పెళ్ళికొడుకులు - II
గమనిక: ఓ పేరుగాంచిన పెళ్ళిసంబంధాల వెబ్ సైట్లో కొన్ని తమాషా ప్రకటనలు ఇవి. ఇలా ప్రకటనలివ్వగలిగిన వారి ధైర్యానికి జోహార్లు చెప్పుకుంటూ, హృదయాంతరాళాల్లోంచి వచ్చిన మాటలు కాబట్టి స్పెల్లింగులు, వ్యాకరణం పట్టించుకోకుండా విషయం చదవండి. ఇవెవర్నీ కించపరచటానిక్కాదు, సరదాగా నవ్వుకోండి అంతే.
మొదటి భాగం మీరు చదవనట్లైతే, ఇక్కడ చూడండి.
****************
i am little fair indian colour. i don’t have any habit. i do exercise and health person.looking good girl. should maintain house well.
పాపం, వీడి ఉద్ధేశ్యం దురలవాట్లేమి లేవని కాబోలు!
iam xxxx. i do owo businas.one sistar.he was marred.
వీడెంత ముదురు అంటే, నాకు అమ్మాయి కావాలి అని కూడా అడగట్ట. బాగా సేఫ్ గా ఆడుతున్నాడు.
I want one girl who love me or my mother. she love me heartly or she havea frank she’s skin colour ‘normal’not a black or not a whitey. I Think the main think is heart if your heart is beautiful then you are beautiful. but iam not a handsome person or not a good looking. but my Mom say that Iam a good person. iam ”Aeklauta”. The choice is your. bye bye.
వీడెవడో కాస్త ఉత్తమ పురుషుడల్లే ఉన్నాడు. కాకపోతే, వీడు అమ్మకూచి అనుకుంటా.
hi iam very cool nauther ok my hobby is see t.v. and news ok i have 1 car and 1 bowl ok my mother also good ok my faruet world is ok
వీడు అన్నీ ఓకే ఓకే అంటున్నాడు ఏమిటో.. ఒక కారు అన్నాడు బాగుంది, కానీ ఒక చిప్ప అని కూడా అంటున్నాడు దరిద్రంగా. ఏమిటో వీడి గొడవ… కొంపదీసి బంగళా అనా వాడి ఉద్దేశ్యం? అమ్మో, ఇంతకు మించి అనువదించుకోటం నా వల్ల కాదు కుర్రోయ్..
i love my patner ok i marriage the patner ok i search my patner ok and i love the patner ok thik hai the patner has a graduate ok
వీడింకో ఓకే బాబు. నేను ప్రేమిస్తా, నేను వెతుక్కుంటా, నేను ప్రేమిస్తా సరేనా? అంటున్నాడు. ఆ సరే బాబూ. కానీ, అమ్మాయి చదువుకొనుండాలి అంటున్నాడు. వాడే వెతుక్కుంటే, ఏ అమ్మాయి కావాలో మనకెందుకు చెప్పటం?
iam very simpel and hanest. i have three sister one brother and parent. want a cooking girl.i am doing postal sarvice and tailor master my original resdence at kalahandi diste.
వీడికి కావాల్సింది వంటమనిషా, ఇంటిమనిషా? ఎందుకో అనుమానంగా ఉంది!
iam good person. have 2 parents. need good girl. shoud love parents. caring and to love them. help for them. i love my parents. shoud know cook. education medium.
వీడు ఆలోచనల్లో శ్రవణకుమారుడే, డౌట్ లేదు. కానీ ఆచరణలో ఆ క్రెడిట్ భార్య ద్వారా కొట్టేద్దామనుకుంటున్నాడు.అమ్మా! తనకి భార్య కావాలన్న తాపత్రయం కంటే, తల్లితండ్రులకి సేవలు చేసే అమ్మాయి కావాలన్న తాపత్రయం కనపడుతోంది. వీడి భక్తిని శంకించలేం కానీ, ఇలా అడగటం సబబేనా అన్నది ??? అందులోనూ చదువులో డిస్కౌంట్ ఇచ్చాడు. వంట మాత్రం ఒక్కడు కూడా అడగటం మర్చిపోవట్లా. కొంపదీసి ఇండియాలో కూడా మగాళ్ళు వంటలు వార్చేస్తున్నారా ఏమిటీ? ఒక్కొక్కడూ తెగ భయపడి చస్తున్నాడు వంట అంటే.
looking a famili girl. god loving. lot of patence. should take care of me and my famuly well. she canot go out to working just need to take care home and children after marrage. i have good job so money no issue. i have parents and sister.
వీడు కుండ బద్దలు గొట్టేసి చెబుతున్నాడు, ఇంటిపట్టునే పడుండాలని. అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయాడు… ఏమిటో …నాకైతే పిచ్చినాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడనిపిస్తోంది ….
ఇదండీ వరస మన పెళ్ళికొడుకులది. పోనీ సత్తెకాలపు వాళ్ళనుకుందామా అంటే, అదీకాదు. అంతర్జాలంలోకొచ్చి మరీ ప్రకటనలిచ్చారే. జై బోలో మేరా భారత్ మహాన్! ![]()


10:54 అపరాహ్నం వద్ద జనవరి 18, 2008
వికటకవి గారు : వారంతపు సాయం సమయంలో హాయిగా నవ్వించేలా రెండో భాగం తొందరగా మా మీదకు వదిలినందుకు అభినందనలు మరియు కృతజ్ఞతలు …
కొంపదీసి ఇండియాలో కూడా మగాళ్ళు వంటలు వార్చేస్తున్నారా ఏమిటీ? ఒక్కొక్కడూ తెగ భయపడి చస్తున్నాడు వంట అంటే. .. ఇక్కడంటే అలవాటు/తప్పదు .. అక్కడ కొత్త కదా … అందులోనూ వంటతో మొదలై అంట్లు దాకా వెళుతుందేమో కదా … ముందు జాగ్రత్త అయ్యుండొచ్చు
11:01 అపరాహ్నం వద్ద జనవరి 18, 2008
okkokkadi requirememnts choosthunte vallu mandipothondi..veella dumpa tega..okkokkadiki gonthemma korikalu..
1:23 పూర్వాహ్నం వద్ద జనవరి 19, 2008
వాళ్ళ మాతృభాషలో రాసుకుని ఉంటే (భాషాపరమైన) తప్పులు తగ్గేవేమో!
2:41 పూర్వాహ్నం వద్ద జనవరి 19, 2008
@వీవెన్, మీరన్నదే నిజమే. కానీ, ఇక్కడ ముఖ్యవిషయం భాష కన్నా భావాలు. అదీగాక, అప్పట్లో అంతగా సొంత భాషల్లో వ్రాసుకొనే సామర్ధ్యం ఇప్పటికన్నా తక్కువే కదా.
@తెలుగు”వాడి”ని, మార్పులు గమనించారనుకుంటా. అదే బెటర్ అనిపించింది.
7:50 పూర్వాహ్నం వద్ద జనవరి 19, 2008
దేవుడా..ఇందులో ఒక్క వెధవకి కుడా పెళ్ళి కాకుండా చూడు తండ్రీ!
8:21 పూర్వాహ్నం వద్ద జనవరి 19, 2008
Good, chaala navvukunnaanu…hehehe
3:22 పూర్వాహ్నం వద్ద జనవరి 20, 2008
నాకు సరీగ్ఘా ఇలాంటివే అమ్మాయిలప్రకటన్లగా చదివిన గుర్తు. ఏది ఏమైనా మీ భావానువాదాలు బాగున్నై నవ్వించేలా హాయిగా
8:42 పూర్వాహ్నం వద్ద జనవరి 20, 2008
రెన్డవ పార్టు కూడా హిట్టే
9:50 పూర్వాహ్నం వద్ద జనవరి 20, 2008
chaalaa funny gaa unnai. Vantamanishi kaavaalani adigite sariponu.
2:52 అపరాహ్నం వద్ద జనవరి 20, 2008
@రవి, @ అశ్విన్, @రావు నెనర్లు.
@క్రాంతి, నేను “తగిన” అమ్మాయిలు దొరకాలని కొంత జాలిపడ్డా. మీరన్నదే రైటు, అసలు దొరక్క పోవటమే మంచిది, ఈ (మగ) పురుగులకి.
@రాఘవ, మీరు భలే పట్టారండీ “ఇంటికి దీపం ఇల్లాలని”. వాడి ఉద్దేశ్యం అంతే అంటారా? ఇకపోతే, నాకూ అమ్మాయిలవి ప్రకటనలు చూడాలని ఉంది, చూస్తా మావాడవీ సంపాదిస్తాడేమో
4:39 అపరాహ్నం వద్ద జనవరి 20, 2008
వికటకవి గారూ మీరు చూసినవి పెళ్ళి ప్రకటనలేనా?నాకయితే వంటమనిషి కావలెను,పనిమనిషి కావలెను అన్న ప్రకటనలలా అనిపిస్తున్నాయి.ఒక్కడికీ పెళ్ళాం వద్దనుకుంటాను.
5:28 అపరాహ్నం వద్ద జనవరి 20, 2008
పెళ్ళాం ఎందుకండి! వండి, వార్చి, కని పారేసే దానికి. అప్పడెప్పుడో ‘తెలుగువాది” అన్నట్టు - వీళ్ళకి మళ్ళీ “తల్లితనం” నేర్పాలేమో! అని అనుకుని “గోపి”లాగా వీళ్ళు ఇలా అడుక్కుంటునారేమో!
1:09 అపరాహ్నం వద్ద జనవరి 21, 2008
వాళ్ళకు వ్యక్తీకరణ చేతకాలేదు. ఇలాంటివి రాసిపెట్టడానిక్కూడా కిరాయి రచయితలు కావాలేమో ! వాస్తవానికి వాళ్ళు అడిగినవాటిల్లో తప్పేమీ లేదు. సమాజంలో రకరకాలవాళ్ళుంటారు. కొంతమంది పెళ్ళికి ముందే ప్రేమించగలరు. కొంతమంది పెళ్ళయ్యాకనే ప్రేమించగలరు. పెళ్ళికి ముందే ప్రేమించగలవాళ్ళు కూడా పెళ్ళయ్యాక సాధారణ సాంప్రదాయిక కుటుంబమూసలో పడిపోతారే తప్ప “చెలీ ! నీ కన్నులలో అనంతాంబరపు నీలినీడలు కలవు” అంటూ పాడేంత భావుకత్వం ఉండదు. “ముందు functional utility నెఱవేరితే ప్రేమించడం సంగతి తరువాత చూసుకోవచ్చులే” అనుకునేవాళ్ళే ఎక్కువ. అందులో తప్పు కూడా ఏమీ లేదు. మగవాళ్ళ నుంచి చాలామంది platonic love ఆశిస్తూంటారు. కాని అదేమిటో ఎవరూ చూసి ఎఱుగరు.
2:43 అపరాహ్నం వద్ద జనవరి 21, 2008
@రాధిక గారు, వాళ్ళ ఉద్దేశ్యంలో అవి వారు కావాలనుకుంటున్న పెళ్ళికూతురిలో ఉండవలసిన కనీస లక్షణాలు.
@ నెటిజన్ గారు, కరక్టే.
@తాడేపల్లి గారు,
అనుమానం లేదు, ప్రకటనలకి రచయితలు ఉండాల్సిందే. లేకపోతే, కొద్దోగొప్పో చదువుకొని, ఆత్మాభిమానం కలిగిన ఏ అమ్మాయీ ఈ తరహా ప్రకటనలు చదివాక, “సరయిన” ప్రత్యుత్తరమిస్తుందంటారా? భావవ్యక్తీకరణంటారా, ఆ విషయములో కొందరిని క్షమించవచ్చునేమో గానీ, మిగతా వాళ్ళ స్వరంలో ఎదుటివారిపై కనీస గౌరవం, పెళ్ళి అన్నది తమ అవసరం కూడా అన్న తాలూకు స్పృహ కనపడనిదే.
10:25 పూర్వాహ్నం వద్ద జనవరి 22, 2008
@kranti
క్రాంతిగారు దేవుణ్ణి “వీళ్ళకు విశాల భావాలు ఏర్పడి, ఆడవాళ్ళ విలువ తెలిసేలా చేయి తండ్రి” అని ప్రార్థిస్తే అందరూ సు:ఖంగా ఉంటారు కదా. “ఎలుక తోలు తెచ్చి”..అనా మీ భావం
9:08 అపరాహ్నం వద్ద జనవరి 24, 2008
ఆ మధ్య ఒక ఫ్రెంచి సినిమా చూశాను, కథ జరిగేది 19వ శతాబ్ది పేరిస్ లో. సోంతగా రాసుకోలేని మగవాళ్లకి ప్రేమ లేఖలు రాసి పెట్టి అమ్ముతూ ఉంటాడు ఒకడు.
మరి అమ్మాయిల గొంతెమ్మ కోరికలు కూడా చెప్పండి! మా బాబాయొకాయిన నవ్వుతూ ఉంటారు - అమ్మాయి నాలుగున్నర అడుగుల పొడుగే అయినా సరే .. వరుడు మాత్రం “అమితాబ్బఛ్ఛన్”! కి ఒక్ఖ అంగుళం తగ్గటానికి వీల్లేదని.
నవ్వుతాలకి బానే ఉంటై గాని .. అసలు పెళ్ళి ఎందుకు అని అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి గానీ ఎందరికి అవగాహన ఉందంటారు? పోనీ వాళ్ళ తల్లిదండ్రులకి ఉందంటారు?
1:10 పూర్వాహ్నం వద్ద జనవరి 25, 2008
lol - ahahahaha
9:35 అపరాహ్నం వద్ద జనవరి 25, 2008
కంతకు తగ్గ బొంత..దేవుడు భలే చమత్కారి..వీళ్ళకు సరిగ్గా తిక్కకుదిరేట్టు సెట్ చేస్తాడు మరి. బావున్నాయి. కొత్తపాళీ గారూ పెళ్ళెందుకంటారేమిటండీ..మా నాన్న పెళ్ళి చేసుకున్నాడు..మా తాత చేసుకున్నాడు..మా పక్కింటోడు, ఎదురింటోడు, పాలోడు, పేపరోడు..ఆఖరికి మా జీతగాడు మూగెన్న కూడా పెళ్ళిచేసుకున్నాడు..అందుకే మరి.
10:47 అపరాహ్నం వద్ద జనవరి 25, 2008
కొత్తపాళీ గారు,
నాకూ తెలుసుకోవాలనే ఉంది, అమ్మాయిల షరతులేవిటో. చూద్దాం అవీ దొరుకుతాయేమో.భలే వారే, ఎందుకు లేదండీ అవగాహన? బాగా చదువుకొని, డాలర్లు సంపాయిస్తున్న ఇక్కడి కొందరు వెధవాయ్ లతో సహా మగాళ్ళకీ, వాళ్ళ తల్లితండ్రులకి ముందు కట్నం ప్రధానమయితేనూ!
అమ్మాయిలంటారా, వాళ్ళకీ బహుశా టిప్పు టాపుగా ఉండేవాడి మీదే కన్నుపడుతుందేమో, విత్ సం ఎక్సెప్షన్స్….
అయినా, రవి గారు చాలా సింపుల్ గా విషయం తేల్చేసార్లెండి.
4:43 పూర్వాహ్నం వద్ద జనవరి 26, 2008
వికటకవిగారూ
ఏ మానవ సంబంధమైనా అవతలి వ్యక్తి పట్ల అవగాహనతో మొదలు కాదు. ముందు స్వప్రయోజనానిదే ప్రథమ తాంబూలం. అనురాగం, ఆప్యాయతా, అవగాహనా వగైరా తరువాతెప్పుడో కాలక్రమేణ వస్తాయి. ట్రాఫిక్కులో అనుకోకుండా మన బండికి తన బండిని తగిలించిన కొత్త వ్యక్తి పట్ల మనం ఏమాత్రం అవగాహనతో ప్రవర్తిస్తాం ? చెప్పండి. అదే ఆ వ్యక్తి మన పాత పరిచయస్తుడైతే మాత్రం “ఓ, మీరా ?”అని నవ్వేసుకుంటాం !
అటువంటప్పుడు వెధవలూ శుంఠలూ కుంకలూ అని తిట్టడం సబబు కాదు.
10:34 పూర్వాహ్నం వద్ద జనవరి 26, 2008
తాడేపల్లి గారు,
క్షమించాలి. పెళ్ళి చేసుకొని తరువాత నే చెప్పిన డబ్బు వగైరా కారణాలతో తరువాత అమ్మాయిలని హింసించే వాడు ఎవరైనా (ఆ మాటకొస్తే మా బంధువుల్లోనే ఉన్నాడొకడు) నా దృష్టిలో వెధవే. వాడు నా నుంచి గౌరవం ఆశించలేడు.
నేనో చెడు సంప్రదాయాన్ని(కట్నం పేరుతో హింస) అనుసరిస్తున్న వాళ్ళని గుంపుగా “వెధవాయ్” అన్నాను గానీ, పేరుపెట్టి ఎవర్నీ అనలేదు.
ఇకపోతే, అడపాదడపా నేను వాడే పదాలు పూర్తిగా హాస్యానికి మాత్రమే. వాటిపై మరో దృక్కోణానికి తావు లేదు. వ్యక్తిగతంగా ఒకర్ని పట్టుకు నిందించనంతవరకూ ఓకే అనుకుంటున్నాను. బహుశా ఎక్కువగా ఇష్టపడి చదివిన “కన్యాశుల్కం”, చూసిన “జంధ్యాల” గార్ల సినిమాల ప్రభావమేమో.
11:15 పూర్వాహ్నం వద్ద జనవరి 26, 2008
Please send Telugu Articles to our Free News Paper Published in Australia. We publish 3 pages in Telugu in one of Indian Monthly magazines. We print 16000 copies every month and is available in Melbourne, Sydney & Brisbane. Please send in Telugulipi
11:16 పూర్వాహ్నం వద్ద జనవరి 26, 2008
Address to send articles: beyondindia.telugu@gmail.com
1:59 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 3, 2008
ఈ బ్లాగు చదివినతరువాత ఇలాంటివాళ్ళు కూడా ఉంటరా అనిపించింది.కష్ట పడి అంగ్లం లో యేడిచారు, వీరి లో అంగ్లం రాని వారు వచ్చినా భవ వ్యక్తికరణ తెలియని వారు ఉన్నారు. వీరి ఆవశ్యకతలు చుస్తుంటే వీళ్ళకి సహధర్మచారిణి కావాలో పనిపిల్ల కావాలో అర్ధం కావట్లేదు.క్రాంతి గారు అన్నట్లు వీరిలో ఏవ్వరికి పిల్లని ఇవ్వకోడుదు పెళ్లి చచేస్కొటానికి. నవ్వుకొవటానికి మాత్రం బావుంది “షరతుల పెళ్లికొడుకులు”.
10:01 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 5, 2008
[...] Comedy and Jokes: Here is a blast on the contemporary ads on Matrimonial web sites. Vikatakavi presented a two-part series on some hilarious ads with matching comments to each of them. The post has been a huge success going by the number of comments it attracted. Read them here and here. [...]
8:02 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 6, 2008
[...] హాస్యం: పెళ్ళి సంబంధాల వెబ్‌సైట్లలో వచ్చే ప్రకటనల మీద వికటకవి రాసిన జాబులు ఈనెల మంచి సందడి చేసాయి. రెండు భాగాలుగా రాసిన ఈ జాబుల్లో పెళ్ళికొడుకులు ఇచ్చిన హాస్యయుతమైన ప్రకటనలను ఏరి కూర్చి, అంతే హాస్య స్ఫోరకమైన తన వ్యాఖ్యానాలతో అందించారు. ఆ జాబులకు వచ్చిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవి రెండూ మంచి ప్రజాదరణ పొందినట్టే. అ జాబుల్లో ఇది మొదటిది, ఇది రెండోది. [...]
11:24 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 6, 2008
మీ ఈ రెండు టపాలు ఆలస్యంగా చదివాను. నవ్వాపుకోలేకపోయాను. Nice Posts.