మళ్ళీ నాగార్జునా యూనివర్సిటీ వారు డాక్టరేట్లు ప్రకటించారండీ. ఓ ఇద్దరి పేర్లు చూశాక జీర్ణించుకోవటం కష్టం అయింది.
కోనేరు రంగారావు (మంత్రివర్యులు) - గౌరవ డాక్టరేట్
డాక్టర్ నాయుడమ్మ (నిజం డాక్టరు) - గౌరవ డాక్టరేట్
ఒకరిది వారసులకు గ్యాసు డీలరు షిప్పు కోసం ఇతరుల్ని బెదిరించి సాధించుకున్న అపకీర్తి. మరొకరిది, అవిభక్త కవలల్ని దేశీయ సౌకర్యాలతో విదేశీ స్థాయిలో వైద్యం అందించి వేరుచేయగలిగే ఘనకీర్తి. ఇద్దరికీ నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది అని వేరే చెప్పనవసరం లేదు.
మరి నాగార్జున యూనివర్సిటీ వారి ఈ గొప్పతనం వల్ల కోనేరు రంగారావు గారి విలువ పెరిగిందా లేక డాక్టర్ నాయుడమ్మ గారి విలువ తగ్గిందో తెలియట్లా? లేక మొత్తానికే ఈ గౌరవ డాక్టరేట్ విలువ తగ్గి అగౌరవ డాక్టరేట్ అయ్యిందా.
గత కొన్ని నెలలుగా ఈ యూనివర్సిటీల డాక్టరేట్ల వ్యవహారాన్ని గమనిస్తుంటే, డబ్బులకి దొంగ సర్టిఫికేట్లు అమ్ముకునే వాళ్ళకి మల్లే ప్రవర్తిస్తున్నట్లుంది.
అయినా నాకర్ధం గాదు, రాజకీయనాకులకి ఈ గౌరవ డాక్టరేట్ల పిచ్చెందుకు? డబ్బు దోచుకోటం అయిపోయింది, ఇహ కీర్తి మీద పడ్డారంటారా?


7:02 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 12, 2008
అదివరకు ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు ఎవరికైనా డాక్టరేట్ ఇచ్చారంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగేది, కానీ ఇప్పుడు అసలు ఆ వార్త చదవాలని కాని ఎవరికి ఇచ్చారో తెలుసుకుందామన్న ఆసక్తి కాని ఉండటం లేదు.
10:19 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 13, 2008
ప్రస్థుతం, అప్రస్థుతం పక్కన బెడితే, ఇవి గుర్తువచ్చనవి.
“గుర్రాన్ని, గాడిదని ఒకే గాట కట్తేసారు”, అని విశ్వనాధ అన్నారంట.
“ఏం చేద్దాం, వారికి గుర్రం ముందు దొరికింది”, అని ముందే ఆసీనులైన జాషువా గారన్నారంట.
ఆ మధ్య ఒక చలన చిత్ర నటుడికి (లెజెండో, సెలబ్రిటియో?) ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ఇవ్వ(క)బోతే, దానికంటే ఒక మెట్టు పైన ఉన్నది, ఢిల్లీ నుంచి తెచుక్కున్నాడన్న వినికిడి.
మొన్న సుశీలమ్మకి కూడ తమిళుల సిఫారసు మీద వచ్చిందన్నది మరొక వార్త.
3:04 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 13, 2008
అమ్మో @ నెటిజెన్, నిజంగానే అంత కధ నడిచిందా విశ్వనాధ, జాషువా గార్ల మధ్య.
@సిరిసిరిమువ్వ, మీరన్నది కరక్టే.
4:18 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 13, 2008
విశ్వనాథ జాషువాగార్ల చమత్కారాల గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి చమత్కారాలు మాత్రమే. వారిద్దరికీ పరస్పరం చాలా గొఉరవం ఉండేది కవులుగా.
9:28 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 15, 2008
hi,sorry for responding in english iam learning to type in telugu.this comment is valid as the award of honorary doctorates has lost all its meaning.there really is no honor in these doctorates.
7:24 పూర్వాహ్నం వద్ద మార్చి 3, 2008
[...] చమత్కరించారు. [ఈ మధ్య ఆంధ్ర దేశంలో రాజకీయ డాక్టర్లు అనే రకం తయారైందన్న విషయం అమెరికాలో [...]
2:29 పూర్వాహ్నం వద్ద మార్చి 4, 2008
yes this is correct one.i studed in nu campus.after declaired this docter degree i am ashamed why i studed this nasty administration university.