సంస్కృత భాష – చిత్రవిచిత్ర ప్రక్రియలు

సంస్కృత భాష, దాని ప్రాముఖ్యం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. భారతీయ భాషల సంగతి అటుంచితే, యూరోపు లోని అనేక భాషలు కూడా సంస్కృతం నుంచే పుట్టాయని కూడా శాస్త్రకారులు చెబుతారు. ఇక వ్యాకరణం తీసుకుంటే, సంస్కృతం మించిన వ్యాకరణం కల భాష మరోటిలేదని మాక్సుముల్లర్ అన్నాడు. ఇంతకీ విషయం ఏమంటే, ఈ మధ్యనే ఓ మంచి పుస్తకం చదివా “The wonder that is Sanskrit” అని. పేరుకి తగ్గట్టుగానే మంచి అద్భుతాలే చెప్పారు ఇందులో.

సంస్కృత భాష గొప్పదనాన్ని వివరిస్తూ అందులోని కొన్ని ప్రత్యేక ప్రక్రియల గూర్చి చాలా బాగా వివరించారు. అందులో “అధమకావ్యాలు”గా పిలవబడేవి కొన్ని. వీటిని అధమకావ్యాలని ఎందుకన్నారంటే సాహితీ విలువల పరంగా వీటిలో స్థాయి తక్కువ. స్థాయి తక్కువన్నానని చిన్నాచితకా శ్లోకాలనుకుంటే పప్పులో కాలేసినట్లే మీరు. స్థాయి తక్కువంటే గంభీరమైన సాహిత్యం కాకుండా కాస్త సరదా సరదా సాహిత్యమన్నమాట. భాషలోని వైశిష్ట్యము, సహజతతో పాటు రాసిన కవుల యొక్క గొప్పతనాన్ని ఇవి తెలియచేస్తాయి. వీటిని చిత్రకావ్యాలు అని కూడా అంటారు. ఇవి అలంకార శాస్త్రములో భాగము. వీటిని రాయడానికి వ్యాకరణం గొప్పగా తెలిసుండాలి. ఇందులో కొన్ని ప్రక్రియలు.

వర్ణచిత్రాలు: ఇందులో పరిమితమయిన హచ్చులు మాత్రమే ఉపయోగించి శ్లోకం చెప్పాలి. కేవలం “ద”,”వ” మరియు “న” లను ఉపయోగించి చెప్పిన ఈ శ్లోకం చూడండి.

దేవానాం నందనో దేవో నోదనో వేదనిందినాం |
దివం దుదావ నాదేన దానే దానవనందిన: ||

దేవతలకు సంతోషము కూర్చువాడునూ, వేదములకు శత్రువులకు(రాక్షసులు) బాధ కూర్చువాడగు దేవుడు(విష్ణువు) లోకమును గొప్ప శబ్దముతో నింపుచూ హిరణ్యకశిపుని చంపెను.

ఇది చూడండి అచ్చంగా “న” తో చెప్పిన శ్లోకం.

న నోననున్నో నున్నేనో నానా నానాననా నను |
నున్నో నున్నో ననున్నేనో నానేనా నున్ననున్ననుత్ ||

అర్ధం:
A man is not a man who is wounded by a low man.
Similarly, he is also not a man who wounds a low man.
The wounded one is not considered to be wounded if his
master is unwounded. And he who wounds a man who is
already wounded, is not a man.

స్థానచిత్రాలు మరియు స్వరచిత్రాలు:ఈ తరహా శ్లోకాలు ఒకే సమూహంలోని హల్లులతో గానీ లేదా కొన్ని హల్లుల సమూహాల్ని నిషేధించటం వల్ల గానీ రచిస్తారు.

అద్భుతమయిన ఈ శ్లోకం చూడండి.

యాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయా ||

దీని అన్వయం (పదాల కూర్పు) ఇది.

యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, యాయాయా, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా

అర్ధం:
The sandals which adorn the lord, which help in attainment of all that is good and auspicious, which give knowledge, which causes the desire (of having the lord as one’s own), which remove all that is hostile, which have attained the lord, which are used for going and coming from one place to another, by which all places of the world can be reached, these sandals are for Lord Vishnu.

ఇవి వింటుంటే, భాష మీద మమకారం పెరిగిపోవట్లేదూ? ఇలాంటి మరిన్ని మరో టపాలో చెబుతాను.

9 స్పందనలు to “సంస్కృత భాష – చిత్రవిచిత్ర ప్రక్రియలు”

  1. Gowri అన్నారు:

    వికట కవి గారు,
    అద్భుతంగా వుంది. వీటిని ప్రచురించి మా అందరికి తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  2. chadnramouli అన్నారు:

    ilanti pustkalakosame nenu sodhana chestunnanu… telipinanduku … krutagnatalu,nenarlu…

    aa pustkam publishers,mariyu doruku chotunu kooda cheppagalaru…

    ilantive nenu naa bloglo kooda vunchanu.. velayinattayite oka pari veekshinchagalaru….

    http://bhuvanavijayam.wordpress.com/category/%e0%b0%ac%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be/page/2/

  3. వికటకవి అన్నారు:

    @ గౌరి, ధన్యవాదాలు.

    చంద్రమౌళి గారు,

    దీనికి సంబంధిచిన మరో టపాలో అడ్రసు వివరాలు ఇద్దామని ఆగాను, కానీ కొన్ని సాంకేతిక కారణాలవల్ల అది కుదరలేదు. ఇదిగో ఆ చిరునామాలు.

    శ్రీ అరొబిందో సొసైటీ
    పాండిచేరి 605002

    ఉత్తర అమెరికాలో
    Antique Collectors’ Club
    East works, 116 Pleasant Street, Suite 60B
    Easthampton MA 01027
    http://www.antiquecollectorsclub.com

  4. సంస్కృత భాష - చిత్రవిచిత్ర ప్రక్రియలు - II « వికటకవి అన్నారు:

    [...] సంస్కృత భాష – చిత్రవిచిత్ర ప్రక్రియలు - II దీనికి సంబంధించిన మొదటి టపా ఇక్కడ చూడగలరు. [...]

  5. surender అన్నారు:

    అద్భుతంగా ఉన్నాయండి ఈ పద్యాలు. నేను ఇంతకు ముందు ఎక్కడో ఒక పద్యం గురించి చదివాను. అందులో విచిత్రం ఎంటంటే ముందు నుంచి చదివితే రామయణం వెనుక నుంచి భారతం అర్థం వస్తుంది. మీరు అలాంటిది చూసారా?

  6. వికటకవి అన్నారు:

    అవునా? నేనెప్పుడూ వినలేదు. నాకు తెలుసుకోవాలనే ఉంది.

  7. రాఘవ అన్నారు:

    నేనూ ఒక ఏకాక్షరి విన్నాను. మన్నించాలి, ప్రస్తుతం ధారణలో లేదు కానీ అది రకారైకాక్షరి అని గుర్తుంది.

    surender గారు చెప్పిన రీతిలో సంస్కృతంలో ఏకంగా రెండు కావ్యాలున్నాయి… రాఘవయాదవీయమ్ అని వేంకటాధ్వరి వ్రాసినది మొదటిది, రామకృష్ణవిలోమకావ్యమ్ అని సూర్యకవి వ్రాసినది రెండవది. అనులోమంలో రామాయణార్థమూ విలోమంలో భాగవతార్థమూ వచ్చేలా ఉంటాయి ఈ రెండు కావ్యాలూ.

    తెలుగులో అనులోమవిలోమాలతో కాకుండా శ్లేషతో రాఘవపాండవీయమనే కావ్యాన్ని పింగళి సూరన్న వ్రాసాడని తెలిసినదే కదా.

  8. మనోహర్ అన్నారు:

    na తో రాసిన పద్యానికి అన్వయం చెప్పి ఉంటే ఫాలో అవ్వడానికి ఈజీ గా ఉండేది

  9. narayana అన్నారు:

    भवन्तः अत्र नूतन श्लोकानां प्रस्तावनां कृतवन्तः तादृशनूतनश्लोकान् वयं ज्ञातुं इच्छामः । भवतां प्रयत्नं सन्तोषदायकरम् अस्ति ।
    धन्यवादः ।
    भुवनगिरि वेङ्कट लक्ष्मीनारायणः

ప్రత్యుత్తరమిమ్ము