ఓ పక్షి కూత
కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని తెలుసు కానీ, ఇలా కూసే పక్షులు కూడా మేసే పక్షుల్ని “పాడు” చేయ్యగలవని ఇదిగో ఇలా కూసాకే తెలిసింది. కోకిలలూ, నేనూ ఓ పక్షిలా కూసానిలా. ఇహ కాకా, కోకిలా లేక మరేదైనానా అన్నది మీ ఇష్టం.
బ్లాగుపెద్దల మంచిమాటలు బ్లాగులో తొలిమెట్టుగా
బ్లాగుపిన్నల సూటిపోటులు బ్లాగులో మలిమెట్టుగా
బ్లాగుటన్నది జన్మహక్కుర బ్లాగరా బెరుకేలరా
బ్లాగుబ్లాగుకు మెట్టుఎక్కర భాగ్యమంతయు నీదెరా


8:00 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 16, 2008
మ.కో. కాకి కోకిల కూతలో మరి గార్ధభంబుల వోండ్రలో
భేకభేకమొ సామగానమొ పేదలిండ్లను శోకమో
రాకపోకల వేళలందున రైలు చేసెడి నాదమో
నా కవిత్వపు పిచ్చికేకలొ నాకు పట్టిన పైత్యమో
8:32 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 16, 2008
@రాఘవ,
ఆశుకవీ, నమో నమ:
6:20 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 17, 2008
[...] పక్షి కూత Posted ఏప్రియల్ 17, 2008 ఈ పక్షిని చూసి పెట్టిన కూత,పెట్టుకున్న [...]
7:30 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 17, 2008
నమోన్నమః!
— ఉభయకవిమిత్రుడు.
8:30 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 17, 2008
ఈ వ్యాఖ్య టపా గురించి కాదు.
నమో నమః అనాలేమో, నమోన్నమః అంటే అర్థం మారుతుందని అనుమానం.
మన సినిమాలలో పాతవాటిలో కూడా ఇలాగే అంటారు కాని నాకు సందేహం.
ఎవరైనా తీర్చగలరా?
3:35 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 19, 2008
“ఓ పక్షిలా” ఎందుకు , కోకిలలానే కూశారు, చాలా బావుంది .