ఇదెక్కడి జల్సా?
జీవితంలో కొన్ని సార్లు కొన్ని ఘోరాలు చేస్తుంటాము. అలాంటి ఓ పని చేసి తల బొప్పి కట్టించుకున్నా. బొప్పి కట్టించిన ఆ ఘోరం ‘జల్సా’.
ఇదేదో వెక్కిరింపుగానో లేదా వేళాకోళానికో అడగట్లేదు. ఈ సినిమా చూసి ఎంతో కొంత నచ్చింది అనుకునే వాళ్ళెవరికైనా ‘ మంచి ‘ సత్తా ఉన్న సన్నివేశాలు (సినిమా పక్కనపెట్టండి) ఒక్క మూడంటే మూడు ఉంటే చెప్పండి.
దయచేసి సినిమా సినిమాలా చూడాలి అనకండీ. నేను సినిమాని పక్కా సినిమాగానే చూశా. ఇంకా చెప్పాలంటే సినిమాని సినిమాగా కన్నా ఇంకా నీచంగానే(గ్రేసు మార్కులిచ్చుకుంటూ) చూశా. త్రివిక్రం ఇలా కూడా తీయగలడా అనిపించింది.
నాకేమి నచ్చలేదో అని రాసే కంటే నాకు నచ్చినవి అని రాస్తే పని సులువవుతుంది అనిపించింది. అదల్లా మహేష్ బాబు గొంతు. అంటే మహేష్ బాబుది అంత గొప్ప గొంతా అని అడగొద్దు. ఈ సినిమాలో ఇదొక్కటే నచ్చింది నాకు
ఇది కాక మరో మూడేవైనా నచ్చితే చెప్పండి. నా బాధల్లా నేనొక్కణ్ణే ఈ జాబితాలోనా లేక నాకు తోడు ఉన్నారా అని తెలుసుకుందామనే.


7:06 pm వద్ద ఏప్రియల్ 21, 2008
ఈ సినిమా నేనింకా చూడలేదు. ఈ సినిమాకీ మహేశ్ బాబు గొంతుకీ సంభందం ఏమిటండీ
7:59 pm వద్ద ఏప్రియల్ 21, 2008
ఏమీ లేదండీ శ్రీనివాస్ గారు,
లగాన్ సినిమాలో అమితాబ్ అక్కడక్కడా కథాగమనం వివరిస్తూ ఉంటాడు కదా. అలానే ఇందులో కథని మహేష్ బాబు చెబుతూ ఉంటాడు. (అచ్చగా సినిమా చూస్తే ఎలాగూ అర్థం కాదు కాబట్టి
)
త్రివిక్రం తన పరిచయంతో ఎలాగో మహేష్ బాబు చేత చెప్పించుంటాడు. ఇటు మన పవన్ కల్యాణ్ పరిస్థితి బాలేదు కదా, అది ఎంతో కొంత ఉపయోగపడుతుందనుకొనుంటాడు. అదీ సంగతి.
10:07 am వద్ద ఏప్రియల్ 22, 2008
శ్రీనివాస్ గారు,
సినిమా మొదటిరోజే నేను ఆ సినిమా రివ్యూ ( మా అబ్బాయి రియాక్షన్) ఇచ్చాను. చావా కిరణ్ కూడా ఆ సినిమా బాధితుడే. అందుకే ఏదైనా సినిమా చూసేముందు ఒక్కసారి మన కూడలిలో తిరిగితే దాని రివ్యూ దొరుకుతుంది. అది చూసి ఆ సినిమా చూడ్డం మంచిది. లేకుంటే ఇలాగే బుర్రలు పాడవుతాయి మరి.
1:19 pm వద్ద ఏప్రియల్ 22, 2008
నిజమేనండీ జ్యోతి గారు, మీ రివ్యూ ఎంత స్పీడుగా చదివానో అంతే స్పీడుగా మరిచిపోయా. అయినా నేను వెళ్ళిన పరిస్థితి వేర్లెండి. గుర్తున్నా తప్పించుకునే ఛాన్స్ లేదు. విహారి కొత్త టపాలో చెప్పినట్లు మన్మోహన్ సింగు లా నా ప్రమేయము లేకుండా వెళ్ళా, ఎవర్నో తృప్తి పరచటానికి.
11:31 am వద్ద ఏప్రియల్ 23, 2008
Ayya vikatakavi gaaru….meeru cinema ni cinema laage choosara…..kaani daanitho paatu inkokati kooda chesthey meeku cinema nacchuthundhi emo…adhe andi…mee manasulo nunchi…kula gajji ane duradu ni teesi pakkana petti choodandi…appudu baaga vuntadhi……
leka pothey enti adni viddoram…ante meeku cinemallo hero 20 anthastuhla building nunchi…kinda poye train paina dookithey cinema baaguntadha….
meeku cinemalo paatalau baaga leva…ani baaga levannarante…me chevulu pani cheuadam ledha emiti…….
mundhu meeru cinemalani ela choodalo alavaatu chesukunnaka…daani taruvaatha me tokkalo sameekshalu pettukunte manchidhi…..mee peru laage meeru kooda koncham onkara anukunta……..cinemala vishayamlo……….
1:27 pm వద్ద ఏప్రియల్ 23, 2008
నాయనా శశాంకు,
ఓ అభిమాని చూసినట్టు సినిమా చూడను బాబూ నేను. నీకు నచ్చితే మంచిదే, నలుగురికి ప్రచారం చేసుకో బాగుందని. నేను నచ్చని వాళ్ళని వాళ్ళ బాధ నాతో పంచుకోమన్నా. అంతే. నీకు దానికంత ఆవేశం ఎందుకు? ఒక విషయం మీద పది రకాల అభిప్రాయాలు విని తట్టుకోగలిగే ధైర్యం అలవాటు చేసుకో. లేకపోతే, ఏమవుతుందో ఓ పెద్దమనిషి ఇక్కడ చెప్పాడు, నువ్వే చూడు.
12:41 am వద్ద ఏప్రియల్ 24, 2008
ఇంటిల్లిపాదినీ(ఐదు ఫుల్లు+ఒక హాఫు+ఒక ఫ్రీ) గ్రాండ్ కారవాన్లో వేసుకొని తీసికెళ్లి, విజిల్స్ వేసి మరీ ఎంజాయ్ చేశా! మరి మెగాభిమానులం మఱి
7:41 am వద్ద ఏప్రియల్ 24, 2008
నమస్కారమ్,
నేను విజయ్యవాడ వాడీని అని ఇక్కడ చెప్పటానికి కారణం. విజయవాడ లో అసలు ఏమీ ఉండవు కేవలం సినిమాలే. ఎండలో 2:35 కు జల్సా విడుదలైన మాడవ రోజు బ్లాకు లో కొనకుండా సినిమా చూసా…
అదీ సంగతి నేను విపరీతమైన త్రివిక్రమ్ అభిమానిని, అంతకన్నా పవన్ కళ్యాన్ అభిమానిని, కానీ ఏమాటకామాటే నాకసలు అర్థం కాలేదు అసలు మధ్యలో ఎం జరిగిందో…
ఆ అరవటం ఏమిటో…
కొంచం తలనెప్పి వచ్హింది.
కానీ సినిమాలో విషయం లేదన్నది వాస్తవం. విషయం ఆంటే ఓ కధా తీరు తమ్యం.
సినిమా మాత్రం ఓ 40 మార్కులు సంపాదించింది. నా ఉద్దేశం లో అయితే పర్లేదు.
7:45 am వద్ద ఏప్రియల్ 24, 2008
తెలుగులో తప్పులు దొర్లినవి గమనించగలరు.( ఓ కొత్త రకమైన పద్దతి ద్వారా రాయటం వలన )
4:58 pm వద్ద ఏప్రియల్ 28, 2008
థాంక్స్ వికటకవి గారు! మీ స్వాగతం బోలెడు బలం ఇచ్చింది !
మీ బ్లాగ్ కు లింక్ చెయ్యొచ్చా ?
5:18 pm వద్ద ఏప్రియల్ 28, 2008
@ఆదిత్య,
నిరభ్యరంతరంగా లంకేసుకోండి
6:07 am వద్ద ఏప్రియల్ 29, 2008
ప్రస్తుతం తెలుగువారిలో రెండే జాతులున్నాయి. జల్సా సూపర్ అనేవారు. జల్సా చెత్త అనేవారు (సినిమా చూడడానికీ, ఈ అభిప్రాయాలకీ సంబంధం లేదు) .
నేను కూడా చూశానోచ్! నాకు నచ్చిన ఒకే విషయం - ప్రేమ విఫలమైనప్పుడు గురుడు లైట్ తీసుకోవడం. హృదయాన్ని పిండేసే సీనులు లేకుండా కధను లాగించడం. (కధేమీ లేదులెండి.)
10:27 am వద్ద మే 5, 2008
sir,
meeru aa cinema ni enduku choosaro kaani, neeno veerabhimani bharyaga velli balayyanu. ardham unna cinemalu raavatam ledani telusu. kanisam cinima ki peruki sambandham undedandi idivaraku, ippudu adi kooda lekunda poyindi……..aa cinemalo jalsa ekkadundo endukundo naakaithe teliya ledu. meekemaina teliste cheppandi please.
8:46 pm వద్ద మే 8, 2008
నాయనా శశాంకా,
ఏదైనా విషయం నచ్చటం లేకపోవటం అనేదానిపై కులగజ్జి ప్రభావం నీబోటి వాళ్లకుండొచ్చేగానీ అది అందరికీ వర్తిస్తుందనుకోకు. జల్సా నచ్చినోళ్లకి నచ్చింది, లేనోళ్లకి లేదు. నీకు నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పు. లేనిపోని వివాదాలు రేపెట్టటమెందుకు?
నాకు ‘పోకిరి’ అస్సలు నచ్చలేదు. ‘అతడు’ చాలా చాలా బాగా నచ్చింది. నేను చూడలేదు కానీ ‘జల్సా’ నచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే అందులో పవన్ కల్యాణ్ ఉన్నాడు కాబట్టి. నా దృష్టిలో అతనికి నటనా ప్రతిభ శూన్యం. కానీ పవన్ మేనల్లుడు అర్జున్ సినిమాలు నాకు సాధారణంగా నచ్చుతాయి. నా ఉద్దేశ్యం ప్రకారం ఇతను మంచి నటుడు. బాలకృష్ణ సినిమాలు నేను చూడను. నాగార్జున సినిమాలు దాదాపు అన్నీ చూస్తాను. జూనియర్ ఎన్టీయార్ వి కొన్ని చూస్తాను, కొన్ని చూడను. అర్జున్ లాగానే ఇతను కూడా మంచి నటుడు, మంచి డ్యాన్సర్ అని నా అభిప్రాయం.
చదివావు కదా. ఇప్పుడు నీ తెలివితేటలుపయోగించి నాదే కులమో చెప్పగలవా?