సమిష్ఠి విజయం సరే, మరి సమిష్ఠి అపజయం మాటో?
సాధారణముగా మనం పెద్ద పెద్ద ఊకదంపుడు ఉపన్యాసాలు మన మన కంపనీలలో పెద్దల నుంచి వింటూ ఉంటాం. అంకిత భావం, గుర్తింపు, సమైక్య కృషి(టీం వర్క్) గట్రా గట్రా…. మనలో చాలా మందికి మల్లే నేనూ ఆపరా నస, వినలేక చస్తున్నాము ఆ పాడిందే పాట పాచిపళ్ళ దాసరి అని.. అని విసుక్కుంటూనే ఉంటాను.
ఈ సొల్లు కబుర్ల కోసం ప్రతి వారం ఓ పెద్ద మీటింగు, దానికో టైము… అంతా కొండని తవ్వి ఎలుకని పట్టే సామెతే.
మా ఆఫీసులో ఓ ప్రాజెక్ట్ దాదాపు ముగుస్తోంది. చివరి రిలీజ్ లో ఎవడో ఓ చిన్న తప్పు చేశాడు. మరీ కాదు కానీ, కొంచెం చెడింది, దాన్ని తర్వాత సరి చేసారు నలుగురూ కలిసి. పై వాళ్ళు మా బాసు మీద కాస్త ఏడిచినట్లున్నారు. వాడొచ్చి నా కొలీగ్ మీద కన్నెర్రచేసాడు. వీడు బాధపడ్డాడు. ఇంత కష్టమూ భ్రష్టుపట్టిందని.
ఇది జరిగాక ఈ అంకిత భావాలు, గుర్తింపులు, సమైక్య కృషులు ఇవన్నీ ఉత్త సొల్లే అన్న నా అభిప్రాయానికి మరింత ఊతమిచ్చాయి. విజయం వెనకే ఇవన్నీ వస్తాయిగానీ, కాస్త తేడా చేస్తే అంతా శూన్యమే. ఒక్కడి విజయాన్ని పదిమంది విజయము గా చెప్పుకొన్నట్లే, ఒకడి అపజయాన్ని పదిమంది కలిసి పంచుకోవటం అన్నది అసలు జరిగేనా?
ఇంక ఆ కాడికి ఈ పెద్ద పెద్ద మీటింగులూ, చెత్తా ఎందుకట? కాస్త ఆలస్యంగా అయినా “సమిష్ఠి విజయం” అని మాత్రమే ఎందుకన్నారో కూడా బాగా అర్ధమయ్యింది.


11:53 అపరాహ్నం వద్ద మే 6, 2008
బాగా చెప్పారు. తన కింద పని చేసేవారు సరిగా పనిచేసేట్టు అజమాయిషీ చెయ్యడమే కాదు, పైనించి వత్తిడి వచ్చినప్పుడు తన టీంకి అండగా నిలిచి వారిని డిఫెండ్ చెయ్యడం కూడా మేనేజర్ ఉద్యోగ ధర్మంలో భాగమే. కానీ ఈ రహస్యం బహు తక్కువమంది మేనేజర్లు గ్రహిస్తారు. మిఋఏ ఎదిగి మేనేజర్ అయినప్పుడు ఈ సూక్ష్మం మరువకండి.
మేనేజర్ పని సఫలం అవడం వెనుక మొత్తం టీం కృషి ఉంటుంది.
5:07 పూర్వాహ్నం వద్ద మే 7, 2008
సమిష్టితత్వం, గుర్తింపు రెండూ వేరు వేరు విషయాలని నా అభిప్రాయం. టీం వర్క్ అంటే చీమల్లా కలసి ఒక్ పనిని పంచుకోమని. కలసి చేసే పనులన్నీ ఫలవంతమవ్వాలనే రూలు ఏదీ లేదు. నలుగురు కలసి అతను చేసిన తప్పుని సరిదిద్దడం అనేది టీం వర్క్, అయితే, ఆ కలిసి చేసేదేదో మొదటినుండీ చేస్తే చీవాట్లు తప్పుతాయి కదా? అసలు జయాన్ని/అపజయాన్ని సమిష్టిగా అనుభవించడం అంటే జయం కలిగినప్పుడు టీం తో మందుపార్టీ చేసుకోవడం అపజయం కలిగినప్పుడు టీం అంతా ఏడవడం కాదు గదా!. ప్రాజెక్ట్ సక్సెస్ లేదా ఫైల్యూర్ అనేది ఆ ప్రాజెక్ట్ చివరలోనే వస్తుంది అంటే మీ సమిష్టి పని అప్పటికే పూర్తయిపోయి ఉంటుంది. మీ టీం కృషి బాగుండి మీ ప్రాజెక్ట్ సఫలం ఐతే టీం సక్సెస్ అంటారు, అదే ఫెయిలయితే టీం ఫెయిల్ అనే అంటారు. అది సక్సెస్ ఐనా, ఫైల్యూర్ ఐనా గుర్తింపు అందరికీ ఉండాల్సిందే. బాగా చేసినోళ్ళకి రివార్డ్ చెయ్యనివాళ్ళకి రిమార్క్ తప్పదు. సక్సెస్ అయిన మీ ప్రాజెక్టులో బెస్ట్ పెర్ఫామర్ గా మీకు కొంత క్యాష్ రివార్డ్ వస్తే, ఎవరైనా దాన్ని అందరితో పంచుకుంటారా? నేనైతే అలాంటి వాళ్ళనెక్కడా చూళ్ళేదు, గుడ్డిలో మెల్లగా ఓ టీ పార్టీ ఇచ్చేవాళ్ళని తప్ప.
1:39 అపరాహ్నం వద్ద మే 7, 2008
చక్స్,
ఫలితం బాగున్నప్పుడు వ్యక్తిగతమైన గుర్తింపు కన్నా, టీం అందరి కృషిగా లెక్కగడతారు. కానీ అదే ఫలితం బాలేనప్పుడు, రంధ్రాన్వేషణ చేసి ఎవడివల్ల టీం నష్టపోయింది అని చీల్చి చెండాడతారు. అది సరికాదన్నదే నా బాధ. కొత్తపాళీ గారు చెప్పినట్లు, అలాంటి సందర్భంలో బాసు అన్నవాడు ఆ వ్యక్తి చేసిన ఆ ఒక్క తప్పుకాక వాడి గత చరిత్రని కూడా దృష్టిలో పెట్టుకొని, సర్దిచెప్పటమో మరోటో చెయ్యాలి గానీ పొడవకూడదు.