చాలా రోజుల నుండీ నేను అర్చకులు, వారి స్థితిగతుల గూర్చి (అమెరికాతో సహా) ఒక సవివరమయిన టపా రాద్దామని సరంజామా తయారు చేసుకుంటూండగానే, ఇవ్వాళ ఈనాడు పత్రిక ఏమాత్రం పరిశోధన అన్నది చేయకుండా ఎవరో నాలుగు ముక్కలు చెబితే అదే నిజమన్న తీరుతో ఈ వ్యాసం ప్రచురించింది. ఇందులో 90% శుద్ధ అబద్దం అని చెప్పటానికి ఇక్కడే అమెరికాలో ఉంటూ ఇక్కడి అర్చకుల జీవనం చాలా దగ్గరినుంచి చూస్తున్నవాడిగా నాకొక్క క్షణం పట్టలేదు. ఎప్పుడో విషయం చప్పబడ్డ తరువాత కంటే, ఇప్పుడు రాయటమే మేలనిపించి రాస్తున్నాను.
ఎవరో ఒకాయన ఓ కారు కొనుక్కుంటే, ఆ ఒక్క వార్తని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసెయ్యటం ఈనాడుకే చెల్లింది. ఈ రోజుల్లో కేవలం 10% శాతం అడ్వాన్సు ఇస్తే, 90% అప్పుగా ఇచ్చి కారు చేతిలో పెడతారన్నది విశ్వవిదితం. పట్టుమని ఓ 100 – 200 మంది అర్చకులు కూడా లేని అమెరికాలో, ఇక్కడికి వలస వస్తున్న వారివల్ల భారతదేశములో అర్చకుల లభ్యత తక్కువవుతున్నది అని చెప్పటం ఎంత మూర్ఖత్వమో అనిపించింది. ఇక అసలు విషయానికొస్తున్నా.
స్వర్గీయ టీ.కృష్ణ గారు గతంలో “దేవాలయం” అని ఓ అద్భుతమైన చిత్రాన్ని మనకి అందించారు. నాకిష్టమైన సినిమాల్లో అదొకటి. ధర్మకర్తలు అర్చకులని అలక్ష్యం చేస్తూ ఎలా దేవాలయాల్ని భ్రష్టు పట్టించారు అనే విషయం మీద. శోభన్ బాబు కెరీర్ లో ఇది ఒక గొప్ప చిత్రమని నా నమ్మకం.
ఆ ధర్మకర్తల తాలూకు లక్షణాలు చాలా వరకు ఇక్కడ అమెరికాలోనూ కనపడుతూనే ఉంటాయి అనటంలో సందేహమే లేదు. కొన్ని నిజాలు.
1) అర్చకుని కనీస వేతనం $500 నెలకి నుంచి (అర్చకుడి అవసరమూ, ధర్మకర్తల అవకాశవాదం కలగలిసి) అత్యధికంగా $1250 వరకు ఉంటుంది. ఈ $1250 పుచ్చుకునే వాళ్ళు ఓ పది మంది ఉంటే గొప్ప విశేషమే. అలాంటిది, నెలకు లక్ష రూపాయల జీతం అని అడ్డగోలుగా వార్త ప్రచురించి జనాలను పక్కతోవపట్టించటం అనైతికం.
2) వసతి ఒక్కటి ఉచితమయినంత మాత్రాన మిగతా జీతం అంతా వెనకేసుకోలేరు గదా? బ్రహ్మచారిగానో లేదా భార్యాబిడ్డల్ని ఇండియాలో వదిలేసి ఉంటేనే ఆ వసతి కూడానూ. తిండీతిప్పలు ఇవన్నిటికీ డబ్బు కావాల్సిందే కదా. వారికొచ్చే జీతంలో మిగతా ఖర్చులన్నీ పోగా ఎంత మిగుల్చుకోగలరన్నది ఇక్కడున్నవారికెరుకే.
3) ఇక ఫ్రీలాన్స్ పురోహితుల సంగతి. ఇక్కడ అమెరికాలో ఉంటున్నవారిలో ఎంత మంది ఇంతవరకూ ఓ ఫ్రీలాన్సు పురోహితుణ్ణి ఇంటికి పిలిచి పూజ చేయించుకున్నారు? ఎంత మంది ఓ దేవాలయం ద్వారా పురోహితుణ్ణి రప్పించుకున్నారు? గ్రీను కార్డు వచ్చి ఫ్రీలాన్సు అవతారమెత్తటానికి ఎన్ని ప్రతిబంధకాలు? ఒకవేళ ధైర్యం చేసి ఎవరయినా అలా అయినా కూడా, స్వంతంగా మెడికల్ ఇన్స్యూరెన్సు కట్టుకోవాలంటే, ఇవ్వాల్టి రోజున నెలకి అధమం $500 ఒక వ్యక్తికి అవుతాయి. అదే కుటుంబానికైతే $1000 పైమాటే నెలకి. $1000 జీతాలున్న స్థితిలోంచి, ధైర్యం చేసి ఫ్రీలాన్సుకెళ్ళి అంతలేసి ఇన్స్యూరెన్సు ఎవరు కట్టుకోగలరు? అర్చకుడు కాదు కదా, అమెరికాలో గొప్పగా సంపాదించే సాఫ్టువేరు కుర్రాడు కూడా సొంతగా మెడికల్ ఇన్స్యూరెన్సు కట్టుకోలేడు, తన యజమాని అండ లేకుండా.
4) న్యూజెర్సీ లోని కొన్ని దేవాలయాల్లో అర్చకులపై ఉన్న నియమాలు వింటే, ఆనాటి ధర్మకర్తలని గుర్తుకు తెస్తారు. అర్చకులు కూర్చోటానికి వీలు లేదు దేవాలయంలో. అదికూడా ఏకధాటిగా 8 గంటలు పనిచేయాల్సివచ్చే శని, ఆదివారాల్లో.
ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చును. ఓ అర్చకుడు, ఓ బ్రాహ్మణుడు కొంత వెనకేసుకున్నాడు అంటే అదేమిటో పెద్ద నేరంగానూ, సృష్టిలో ఓ కొత్త వింతగానూ ప్రచారం కల్పించే తత్త్వం విడనాడితే బాగుంటుంది.
అమెరికాలో అర్చకుడి సంపాదనకీ, సాఫ్టువేరు డెవలపరు సంపాదనకీ పోలికా? ఇంత చెత్త న్యూసు ఈనాడులో చూసి, చదివి చాలా కాలమయ్యింది.


4:59 అపరాహ్నం వద్ద మే 7, 2008
ఈనాడు కధనం చదవలేదు గాని, మీ టపాలో “చేదు నిజాన్నీ” పదిమందికి ఎలా అందజేయాలో – దీపంలో పడి శలభల్లాగ మాడిపోకుండా ఏం చెయ్యాలో?
5:27 అపరాహ్నం వద్ద మే 7, 2008
కథనంలో ఉన్న విషయ పరిపుష్తి సంగతి పక్కన పెడితే కేవలం కథనంలో పాథకులకి వినిపించే టోన్ ద్వారా ఒక నెగటివ్ భావనని ఎలా కలిగించవచ్చో ఈ ఈనాడు వార్తా కథనం మంచి ఉదాహరణ.
నిజమే, పదేళ్ళకి పైగా స్థిరపడి స్వయం ప్రతిపత్తి కలిగిన ఆచార్యులు లేకపోలేదు. కానీ దేశం మొత్తమ్మీద వారి సంఖ్యని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఆలయంలో ఉద్యోగిగా చేసేవారు బ్రహ్మచారులో లేక కుటుంబాన్ని ఇండియాలో ఉంచి ఇక్కడ ఒంటరిగా ఉన్నవారో అయితే తప్ప ఉచిత వసతులు దొరకవు. కుటుంబం అంటూ ఉంటే మిగతా వారిలాగానే ఒక అపార్టుమెంటు అద్దెకి తీసుకోడం, కుటుంబ నిర్వహణకి ఒక ఖారు కొనుక్కోడం తప్పని సరి. ఇహ ఆలయ కమిటీల్లో అందరూ వీళ్లకి మొగుళ్ళే .. అందరికీ అణిగిమణిగి ఉండాలి.
వికటకవి గారూ, విషయాన్ని విడమర్చి మంచి టపా రాశారు.
6:12 అపరాహ్నం వద్ద మే 7, 2008
Eeenadu article was inspired from
http://www.washingtonpost.com/wp-dyn/content/article/2008/03/25/AR2008032502694_pf.html
11:02 అపరాహ్నం వద్ద మే 7, 2008
@ నెటిజెన్, నేను ఈ చెత్త వార్తలు ఏ ఆధారంతో రాశావని ఈనాడుకే రాసాను. వాళ్ళు చదవటం, చదవకపోవటం వేరేసంగతి.
@ కొత్తపాళీ గారు, నేను మరచిన కొన్ని మీరు గుర్తుచేసారు, అవి కూడా పొందుపరచాను. గుడి కట్టటం, దానిని ఓ సంస్థానంగా భావించటం ఓ ఫ్యాషన్ అయిపోయింది మన దగ్గర కూడా. డబ్బు తరువాత ఇక మిగిలింది కీర్తే కదా.
@ చారి గారు, లంకెకు ధన్యవాదాలు. ఒకడు మేకను చూపించి పంది అంటే, కాదు కాదు అది కుక్క అన్నాట్ట మరొకడు. ఇదదే వ్యవహారం.
1:47 పూర్వాహ్నం వద్ద మే 8, 2008
ఈనాడు కధనాన్ని బట్టి కాదుగానీ నేను స్వయంగా చూసాను చాలామంది పురోహితుల్ని.[9 మంది]వారందరూ చాలా బాగా బ్రతుకుతున్నారు.లెక్సాసు కారు,సొంత ఇల్లు,గ్రీను కార్డు…ఇవి కాకుండా దక్షిణ[పళ్ళెంలో డ్బ్బులు వెయ్యొద్దని గుడిమొత్తం రాసినా మనం వెయ్యకమానము,పంతుళ్ళు అడగకమానరు].అదికాక పూజలమీద సంపాదించేదే చాలా ఎక్కువ ఉంటుంది.కారుకొన్న ప్రతీవారూ[నూటికి 80 మంది]పూజలు చేయిస్తారు.నెలకి 3,4 వ్రతాలు.సత్యనారాయణ స్వామి వ్రతానికి పూజారికి ప్రత్యేకంగా 75$,నవగ్రహాలకు,అష్టదిక్పాలకులకు అని చెప్పి డాలర్లను పువ్వులతోపాటూ పెట్టిస్తారు.వాటి కోసం 60$[పూజకు కావాల్సిన సామాను లిస్టులోనే చెప్పేస్తారు క్వార్టరు బండిళ్ళు ఆరు తెచ్చుకోండి,మీకు తాహతుంటే డాలర్లు కూడా తెచ్చుకోండి అని]ఇవికాక ఆశీర్వాదానికి 10$, దర్శనానికెళితే హారతికి డాలరు తక్కువకాకుండా తీసుకుంటారు.ఇవికాక పళ్ళు,స్వీట్లు,అభిషేకానికి తెచ్చిన పాలు,పెరుగు,నెయ్యి,తేనే[వీటికెంత అయిపోతుంది అంటారా?అన్నీ కొత్త సీసాలు తెమ్మంటారు.కొనేటప్పటికి నిజంగానే దేవుడు కనిపిస్తాడు]ఇంటికి పిలిచి ఎవౌ చేయించుకుంటారు అంటారా?బొచ్చెడు మంది అనను కానీ కనీసం రెండునెలలకి ఒక పూజ ఉంటుంది.ఈ వ్రతాలే.ఇంటికొచ్చిచేసినందుకు వారు తీసుకునే రేటు పెట్రోలు ఖర్చు+300*.మిల్వాకీ నుండి ఆపిల్టన్ నెల నెలా వస్తుంటారు ఒక పంతులుగారు.దగ్గర దగ్గర రెండు గంటల ప్రయాణం.ఈ పూజల రేట్లు నాకెలా తెలుసా అనుకోకండి మేము తరచూ వ్రతాలు చేయించుకుంటాము.[ఇంటికి పిలిచి కాదనుకోండి].అంటే అన్ని చోట్లా ఇలాగే వుంటాయి రేట్లు అనను గానీ మేమున్న పాత ఊరులోను,ఇక్కడ ఇంచుమించు ఇవే రేట్లు.[వాళ్ళేదో సంపాదించేసుకుంటున్నారని ఎప్పుడూ అనను.ఇప్పుడు చర్చ వచ్చింది కాబట్టి చెప్పాల్సివచ్చింది.]
4:39 పూర్వాహ్నం వద్ద మే 8, 2008
ఈనాడు గాడు తాను వాషింగ్టన్ పోస్ట్ నుండి తీసికున్నానని వాడి న్యూస్ లోనే వ్రాసాడు కాబట్టి మీకు రెస్పాన్స్ వస్తుందనుకోను, వచ్చినా బహుశా చారి గారిచ్చిన లింకే ఇవ్వచ్చు. మీరు అడగాల్సింది వాషింగ్టన్ పోస్ట్ వాడిని లేదా ఆన్యూస్ లో కనిపించిన పూజారి “భాస్కరశాస్త్రి”గారిని. ఏదైనా విషయాన్ని ఓవర్ గా రాయడమే ఈనాటి జర్నలిజం అనుకుంటా! ఒకడంటాడు ఇండియాలో సాఫ్ట్ వేర్ బూమ్ బ్రహ్మాండంగా ఉంది, జీతంకూడా 30000 నుండి 2లక్షల దాకా వస్తుందని. ఎంతవరకూ నిజం. తీసుకునేవాళ్ళు లేరనికాదు, వున్నారు. కానీ అతి తక్కువగా నెలకి 5000 తీసుకునేవాళ్ళు లేరా? అలాంటివాళ్ళ కష్టాలు ఎంతమందికి తెలుసు? IIM లోంచి బయటపడితే కోట్ల కొద్దీ శాలరీలంటాడు, అందరికీ వస్తుందా అంతమొత్తం? గల్ఫ్ దేశాల్లో మన కూలీలు నానా రకాల హింసలూ పడుతున్నారంటాడు. అక్కడున్న భారతీయిలందరూ అందరూ హింసలు పడుతున్నారనుకుంటే అది మన భ్రమే. ప్రతీ విషయాన్నీ జనరలైజ్ చేయడం తోనే ఈ ప్రాబ్లమ్ అంతా, ఒక వర్గం లో కొంతమంది సుఖపడితే, ఆ వర్గ మంతా సుఖమన్నట్లు రాస్తారు, అదే కొందరు కష్టపడినా అలాగేరాస్తారు.
5:19 పూర్వాహ్నం వద్ద మే 8, 2008
“సాక్షి”కిస్తే సరి, ఎగ్గిరి గెంతి, వాడు ఇంతింత అక్షరాలతో వేసుకుంటాడు ఈనాడు తప్పుడు కథనమని. ఆ సాక్షిని చదివే పది మందికీ తెలుస్తుంది.
(బాబోయ్, నాకు కూడా ఈ కుతంత్రాలు అంటేస్తున్నాయ్, కానీ మంచికే కదా… కాబట్టి ఫర్వాలేదు)
10:47 పూర్వాహ్నం వద్ద మే 8, 2008
Vikata Kavi Garoo
Meeru cheputunnadi correct kavachu, eenadu vallu cheputunnadi correct kavachu…
Nenu enduku ilaga annanante..Naku telisina oka friend vallu cheppinatte samrpinchukonnadu kabatti..
Panduga rojullo, Archakulaku enta demand untundo meeku teliyandi kaadu… Vetanam kooda ante baareega untundi mari..
Ika Mee point ki vaddamu
Salaballaga maadi masi avutunna vallu Archakule kaadu…Software Engineers avutunnaru..Students avutunnnaru…
Enduku alaga avutunnaranedi mee antaratmake vadilesthunnanu…
Madhu
12:18 అపరాహ్నం వద్ద మే 8, 2008
evaraina videsalaku velladaaniki mukhya kaaranam dabbani anedi telisina vishayame. ademanta chidambara rahasyam kaadu. software aina chef aina purohithulaina videsalaku velladamantu thatastiste vaaru kharchu pettindi sampadinchataniko leka adhikam ka laabhinchataniko chestaaru. archakatvaniki anta demand undante mana samskruti inka akkada unna vaallaki gurtundi ani santoshiddam. kaani lekkaku minchi sampadistunna migata vaarini vadilesi archakulani eenadu lanti circulation unna patrika target cheyadam manchi paddati kaadani naa uddesam
12:42 అపరాహ్నం వద్ద మే 8, 2008
@ రాధిక గారు,
క్షమించాలి. ఈ విషయములో నాదగ్గరున్న సమాచారం చాలా విశ్వసనీయమయినది. ఓ రకంగా ఫస్ట్ హాండ్ సమాచారం అనుకోండి. దశాబ్దంగా న్యూజెర్సీలో (అత్యధిక భారత జనాభ ఉన్న చోట) గల ఇద్దరు, ముగ్గురు ఫ్రీలాన్స్ అర్చకుల పరిస్థితి ఏమంటే, ఒకరు రిస్కు తీసుకొని మెడికల్ ఇన్స్యూరెన్సు లేకుండానూ, మరొకరు ఏదో కంపనీ వాళ్ళని బతిమిలాడుకుని వాళ్ళ ద్వారా తక్కవ ధరకి పొందటము చేస్తున్నారు. నేనన్న మెడికల్ ఇన్స్యూరెన్స్ ధరలు మీరు తోసిపుచ్చలేరు కదా. ఇకపోతే, గుడి తరఫున చేయించుకుంటే మీరు ఇవ్వాలనుకున్నదే వారికి దక్కేది, మిగతాది ఎలాగూ గుడికే కదా చెందేది. ఇక అది మీరు వ్యక్తిగతంగా కూడా ఎక్కువ ఇచ్చిఉండొచ్చు అందరూ ఇవ్వాలని రూలు లేదు కదా. నాకు తెలిసి $25 ఇచ్చి దణ్ణం పెట్టేవాళ్ళు ఉన్నారు (వారిది తప్పులేదు, ఎందుకంటే గుడికి ఇచ్చేది కాక వాళ్ళు అంతకన్నా ఎక్కువ అనవసరం అనుకోవచ్చు).సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, సంవత్సరంలో దాదాపు ఓ 3 నెలలు పురోహితులకి మూఢం, గ్రహణాలు మరియు అమావాస్యలు వగైరాలతో పని ఉండదు. ఎవరికీ వారు చేయించుకోమని చెప్పరూ, ఎవరూ చేయించుకోరు. మరి ఆ మూడు నెలల భుక్తి ఎలా గడవటం? ఇక లెక్సాసు, ఇల్లు అంటారా, బహుశా అదొ క ఎక్సెప్షన్ అనుకుంటా (ఒకవేళ మీరన్నది అ100% నిజంగా ఫస్ట్ హాండ్ సమాచారమయితేనే). అదీ మీరు చూసిన 9 గురిలో ఒకరో ఇద్దరికో ఉందేమో. ఎందుకంటే (మిమ్మల్ని కాదు), ఒక భ్రమ ఏమంటే ఈనాడు వాడి లాగానే, అబ్బా 2 గంటల్లో ఈయన $150 సంపాదించాడు, తాను చేయించుకున్న ఒకటో రెండో సందర్భాలని బట్టి తనలాగే అందరూ పూజలు, వ్ర్రతాలు రోజుకొకటి చేయించుకుంటారన్న భ్రమతో).
@ చక్స్,
మీరు కరక్ట్ గా చెప్పారు. జనరలైజ్ చేసి రాయటమే కొంప ముంచుతోంది. ఏదో బాగున్న ఓ నలుగుర్ని తీసుకొని, మిగతా 96 మందికి అవే మాటలు అంటగడితే ఇలానే ఉంటుంది.
@ మధు,
పూజలు, పునస్కారాలనేవి లగ్జరీ కాదూ, అవసరము అంతకన్నా కాదు. మనం ఇష్టపడి, సిద్ధపడి చేయించుకునే వ్యవహారం. రేటు నచ్చకపోతే అసలు పూజ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఇండియాలో లాగా ఇక్కడ నీకు అదవుతుంది, ఇదవుతుంది అని భయపెట్టే వారెవరూ లేరు కదా. ఇక అర్చకుల డిమాండు పండుగరోజుల్లోనా? అమెరికా గురించి మాట్లాడుతున్నారా లేక ఇండియా గురించా? అమెరికాలో అయితే, సారీ, ఏవో ఒకటి రెండు పెద్ద పండగలు తప్ప, మిగతా వాటికి అసలు గుడికొచ్చే వాళ్ళే తక్కువ. మీరనుకునే ఆ “భారీ వేతనం” తెలుసుకోవాలని ఉంది. నేను చెప్పిన అర్చకుల వేతనాలు పచ్చి నిజాలు. సగటు అర్చకుడికి అమెరికాలో జీతం $750 నుంచి $1000 నెలకి. కానీ, మీరు చెప్పిన సాఫ్టువేరు డెవలపరూ, స్టూడెంట్స్ విషయము నేనొప్పుకుంటా. వాళ్ళ కష్టాలు తెలుసు. అది నిజమే. మరి ఆ కష్టాలు తెలిసిన మీరు అర్చకుల కష్టాలను ఊహించలేరా?
@ రాఘవ, సాక్షి జబ్బు వీడికీ అంటుకున్నట్లుంది.
2:13 అపరాహ్నం వద్ద మే 8, 2008
@ మాధురి గారు,
సింపుల్ లా మూడు ముక్కల్లో విషయం సరిగ్గా చెప్పారు.
5:56 అపరాహ్నం వద్ద మే 8, 2008
మా ఊళ్ళో కూడా వెంకటేశ్వర స్వామి ,శివుడు కలసి ఉన్న టెంపుల్ ఉంది అందులో ఎవరినైనా పురోహితులని పూజలు చేయటానికి ఇళ్ళకి పిలిచినప్పుడు పూజలు చేయగా వచ్చిన డబ్బు కానీ అక్కడే గుళ్ళల్లో పూజలు చేయగా వచ్చిన డబ్బుని పూజారులందరూ సమానం గా పంచుకుంటారు. అలా ఒకరికి ఎక్కువగా మరొకరికి తక్కువ రాకుండా ఉండటానికి. బైదవే మా ఇద్దరి పిల్లలకు బారసాల చేయించినప్పుడు 100 డాలర్లు లోపే ఇచ్చినట్టు గుర్తు. అలాగే వాళ్ళకెవరికీ కారులు కూడా లేవు మేమే పిక్ చేసుకొని మేమే దింపాము. అలాగే ఇంకొక విషయం హారతి పళ్ళాలలో వేసిన డబ్బుల్ని మా ముందే తీసుకువెళ్ళి హుండీ లో వేసే వారు.
అయినా అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళని వదిలేసి (వాళ్ళని ఏమి చేయలేకనే అనుకోండి ) ఇలా అర్చకుల మీద పడటం ఏమీ బాలేదు!!
7:26 అపరాహ్నం వద్ద మే 8, 2008
‘అర్చకులది విలాసవంతమయిన జీవితం’ అన్న వ్యాఖ్యని పక్కన పెడితే ఈనాడు రాసిన వార్తలో తప్పు పట్టవలసిందేముంది? అర్చకులకు (అందులోనూ తెలుగు మాట్లాడేవారికి) ఇక్కడ ఉన్న డిమాండ్, వాళ్లు వీసా పొందటానికి అవసరమైన అర్హతలు, ఒకప్పుడు వాళ్లకున్న సాధక బాధకాలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితిలో వచ్చిన మార్పు .. ఇలాంటివన్నీ నిజమే కదా. ఎటొచ్చీ, software engineers అర్చకులని చూసి అసూయ పడటం అనే సరదాగా వ్యాఖ్యానించాల్సిన విషయాన్ని మరీ ఎక్కువ చేసి చూపించటం, అందరూ బెంజ్ కార్లలో తిరుగుతున్నట్లు రాయటం మాత్రమే ఈనాడు జోడించిన అతిశయోక్తులు. ఆ వార్త గురించి మనం మరీ ఇంత ఎక్కువగా తలబాదుకోనవసరం లేదేమో?
http://anilroyal.wordpress.com
http://anilroyal.blogspot.com
8:45 అపరాహ్నం వద్ద మే 8, 2008
మీరు చెప్పే ఇన్సూరెన్స్ సమస్యల గురించి నేనూ ఒప్పుకుంటాను.నిజానికి తక్కువే వస్తూ ఉండొచ్చు.వారి వేతనాల సంగతి నాకు తెలియదు.నాకు తెలిసిందల్లా మేము గుడికెళ్ళినప్పుడలా సమర్పించుకుంటున్నది ఎంతాని.[దేవుడికిచ్చిన డబ్బులు,పూజారులకిచ్చిన డబ్బులు ఇచ్చామని బాధపడకూడదట.నేను దానిని పాటిస్తున్నాను.రేటులెంతో తెలియచెప్పడమే నా ఉద్దేశ్యం అని అందరూ తెలుసుకోవాలి] మనతాహతునుబట్టివెయ్యడంకాదండి…వారు ఇంతకావాలని డిమాండు చేస్తున్నారు.పండుగలకి గుడులకి ఎవరు వెళుతున్నారు అంటారా?తొలి ఏకాదశి నుండి ప్రతీ చిన్న విశేషమయిన రోజుకూ భక్తులు వెళతారు.దర్శనానికి గంట పైనే పడుతుంది.ప్రతీ శని,ఆదివారాలు ఇంక చెప్పక్కర్లెద్దు.జనసముద్రంలా ఉంటుంది.అంత తొక్కిసలాటలో ఎందుకులే అని ఈ మధ్య గుడికి వెళ్ళడం మానేసాము.
మావారి సొంతూరు నుండి ఇద్దరు అర్చకులు ఇక్కడ ఉంటున్నారు.వారు సొంత ఇళ్ళు సమకూర్చుకోవడమే కాకుండా[రావడమే గ్రీను కార్డు తో వస్తారట వీళ్ళు]రాజమండ్రికి దగ్గరలో మూడంతస్థుల ఆశ్రమం కడుతున్నారు.అది వారి తండ్రిగారి కోరిక.పురాణ పఠనం,అన్నదానము అది చేస్తారట.దేవుడు ఇస్తున్న సొమ్మును దైవ కార్యాలకు వినియోగించాలనే వారి ఆశయం నాకు చాలా నచ్చింది.
మరి వీళ్ళు మాత్రం ఎలా సంపాదిస్తున్నారు?వేరే పనులు చెయ్యడానికి వారికి తగినంత భాషరాదు.నాకు తెలిసి ఇతర పనులేమీ చెయ్యట్లేదు.
మీరు చెప్పింది తప్పని చెప్పాలని కాదు నా ఉద్దేశ్యం.మరి నాకు కనబడేవాళ్ళంతా ఇలా ఎందుకున్నారని?
11:39 అపరాహ్నం వద్ద మే 8, 2008
ఉపసంహారం:
నా ఈ టపా వెనక ఉద్ధేశ్యం పత్రికలో ఈ విషయముపై వచ్చిన వార్త ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి కొన్ని సత్యాలు నలుగురికీ తెలియచేద్దామనే. అందులో సఫలమయ్యాననే అనుకుంటున్నాను. ప్రతి చర్చలోనూ ఉన్నట్లే, కొందరు సమర్దిస్తూ, మరి కొందరు వేరు వేరు అభిప్రాయాలు వెల్లడించారు. రాధిక గారు అంత ఘంటాపదంగా చెబుతున్నారు మరి, కాబట్టి వారి ఊరు ఆ కొందరు ఎక్సెప్షనల్స్ ఊరుగా భావించుదాం. నేను మాటవరసకి రెండు, మూడు పండగలు అన్నాన్లెండి. ఇండియాలో అంత ఉండరని చెప్పదల్చుకున్నాను. మీరు పాటిస్తున్న నియమమూ మంచిదేనండి. నాకు తెలిసిన సత్యాలననుసరించి, నేను తక్కువ హుండీలోనూ, ఎక్కువ అర్చకులకే ఇస్తాను కనీసం ఇక్కడి వరకూ.
ఇంతటితో ఈ చర్చకి ముగింపు పలుకుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.
1:22 పూర్వాహ్నం వద్ద జూన్ 2, 2008
[...] అమెరికాలో అర్చకుల స్థితిగతులపై వికటకవి రాసిన జాబుపై కూడా చర్చ బాగానే జరిగింది. [...]
9:50 పూర్వాహ్నం వద్ద జూన్ 5, 2008
archakula kosam maatlaade mundu tamilanaadulo periyar ramasway cheppinavi gurtu chesukovaali ” manamu manusulam anee sangati maracihpoyi kulaalu, mataaluga chilipoyinadi kevalm brahmana bhavajaalam valane. atuvanti bhaavajalaanni protshahinchadam avivekam.
5:09 అపరాహ్నం వద్ద జూన్ 17, 2008
@ కోటేశ్వరరావు,
ఇప్పుడు ఇక్కడ కులాల గురించెవరు మాట్లాడారండీ? ఫలానా వారి స్థితి సరిగా లేదు అన్నది చర్చ, వాడిదే కులం అన్నది పూర్తిగా అప్రస్తుతం.
8:24 పూర్వాహ్నం వద్ద జులై 9, 2008
baagundi anni rakaala vruthhula lo unna vaari sadaka badakaalani chrchaku pettandi
8:01 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 14, 2008
Dear all,
I agree fully with Mr vikatakavi and it is very strange that even in India people are not paying proparly to archakas and they think the profession is ranked below and people are in such a mood that archakas are paid unnessryly and feel that they only read mantras and dont consider their labour of chantings .If it is so why you do pooja and call him.Eenadu projected that they earn lakhs .this is only mudslinging of one cast and community.
8:16 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 14, 2008
This is in reply to Mr koteswara rao “s reply this is not proper to only blamebrahmins .Every body is responsible Mr koteswara rao might be having grudge against brahmins or he might have mis guided by sefish leaders for their growth they mudsling on somebody.First atleast consider the archaka as a humanbeing and he is doing labour for religion people and the same periyar consider other religions priests but not of hindu faith they repel of such nonsense.
5:54 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 23, 2009
A purohit is a being who thinks about the welfare of people in his place, and works for their welfare. It is the responsebility of that village people to take care of the welfare of that purohit and his family. But it is everybody’s secret whatis really happening . what ever is supposed to go to him is robbed from him . It has become a fashion to critise him by his caste. Time has cahnged , circumstances have changed, a purohit is also a human being, he also has to change just like u and me. Only thing, he is not taught to loot unfortunately.
3:36 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 24, 2009
ఈ పెపర్ ని ఆంధ్ర జనానికి చేప్పిన అబద్దాలు ఇంకేవరు చెప్పలేరెమొ. ముడ్డి తుడుచు కోవటానికి తప్ప ఇంకెందుకు పనికి రాదు. మన ముఖ్యమంత్రి గారి వలన వారి బండారము బయటపడింది లేక పొతే ఈ జన్మలో వారు ఏ తప్పు చేయని మహానుభావుల లిస్ట్ లో చేరి భారత రత్నకు తయరై ఉండెవారు. వారు తీసిన సినేమా లను చూస్తే నే అర్థమౌతుంది వారి వ్యాపార ధోరణి. మొదట మయురి, ప్రతిఘటన లాంటి అభ్యుదయ సినేమాల నుంచి మొదలెట్టి చిత్రం సినేమా వరకు దిగజారారు. సరిగ్గా ఇటువంటి కేర్క్టెర్ నే అయాన్ రాండ్ ఫౌంటెన్ హేడ్ లో రాస్తుంది.ఈ పేపర్ ను చూసి ప్రతి ఒక్కరు తయరు ఈ వ్యాపారానికి. 10 టి.వి. చన్నెల్స్