మా బంధువుల్లో ఒకమ్మాయి బొద్దుగా ఉండేది. ఎవరన్నా ఆట పట్టిస్తే, బొద్దుగా ఉన్నానని నవ్వుతారేమిటి, ఎముకలు బయటపడే పీల తనం కన్నా, అసలు బొద్దుగా ఉంటేనే అందం తెలుసా అనేది. అంతే కాదు, అలనాటి మహానటి సావిత్రిని గుర్తు చేసి, సావిత్రి బొద్దుగా ఉంటేనే జనాలు ఇష్టపడ్డారని ఎదురు వాయించేసేది. సావిత్రిని తెలుగు వాళ్ళు ఇష్టపడింది బొద్దుగా ఉండటం వల్ల కాదమ్మా ఆవిడ నటన వల్ల అన్నది ఆవిడతో వాగ్వివాదంలో ఒప్పించి మనం గెలవలేమనుకోండి. అసలు సంగతి అదికాదు.
మరేమిటి అంటే మన ఎయిర్ ఇండియా వారు వారి విమానాల లోపల పనిచేసే సిబ్బందిని ముఖ్యంగా ఎయిర్ హోస్టెసు లను పరిమితికి మించి బరువు పెరిగితే (చాలా మంది అప్పటికే పరిమితి మించారన్నది వేరే సంగతి, అలాంటి వారిని బరువు తగ్గమన్నారు) వారిని గ్రౌండ్ డ్యూటీలకి మారుస్తామని హెచ్చరించారుట. ప్రభుత్వ రంగ సంస్థ గదా, ఎవరూ లెక్క చెయ్యలేదు సరికదా ప్రభుత్వం మీదే కేసు పెట్టార్ట కోర్టులో. (మేము లావుగా ఉన్నా చేసే పనిలో ఏ తేడా రాకుండా చేస్తున్నామని). అయినా పరుగెత్తాల్సిన పోలీసులే ఇంతలేసి పొట్టలేసుకొని పోలీసు శాఖలో నిక్షేపంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే, కుళ్ళు కాకపోతే 200 అడుగుల విమానంలో అటూ ఇటూ తిరిగుతూ ప్రజలకి సేవలు అందిస్తున్న మా మీదే ఎందుకీ కక్ష సాధింపు అని వాళ్ళు అనుకుంటూండొచ్చు.
గట్టి వాదనే. కానీ వచ్చిన చిక్కల్లా ఆ ముక్క అనాల్సింది ప్రయాణిస్తున్న ప్రయాణీకులు గానీ వారు కాదు కదా. ఓ పక్కన తోటరాముడు మల్లె తీగల్లాంటి సేవికలున్నారని కింగ్ ఫిషర్లో, జెట్లలో తానొక్కడే ఊళ్ళు తిరిగెయ్యటమే కాకుండా, పనిగట్టుకుమరీ ఇతరుల్ని రెచ్చగొట్టి ఎయిర్ ఇండియా/ఇండియన్ విమానాలు ఎక్కటమంత దురదృష్టకరం మరోటి లేదన్నట్లు చెప్తున్నాడు. ఇలా అయితే, భారీకాయాల సేవికలున్న ఎయిర్ ఇండియా/ఇండియన్ విమానాల్ని ఎవరు ఎక్కుతారు చెప్పండి? ఇన్నాళ్ళూ అంటే ఏదో పెద్ద వాళ్ళూ, పెద్ద వయసు వాళ్ళు లేదా మరో ఎయిర్ లైన్సు గతి లేక ప్రయాణించారు అంటే అర్ధం ఉంది. ఇప్పుడలా కాదే? విమానాలు ఎక్కే వాళ్ళలో కుర్రకారు ఎక్కువైపోయారు. సవాలక్ష విమాన కంపనీలు. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి పనితనంతో పాటు రూపు కూడా అవసరమే. తమ అస్థిత్వానికే ప్రమాదమొచ్చే పరిస్థితి కాకపోతే, మన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలోని ఎయిర్ లైన్సు వారు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోరు కదా. కోర్టు కూడా వాస్తవ స్థితి గ్రహించినట్లుంది. ఒళ్ళు తగ్గాల్సిందే నంటూ జారీ చేసిన హుకుం సమర్ధించింది.
ఈ రోజుల్లో బొద్దుగా ఉండటం ముద్దు కాదని ఎలా వీళ్ళకి చెప్పటం చెప్మా?
** మన కవులు ఎక్కడో స్త్రీలు బొద్దుగా ఉండటాన్ని మెచ్చుకున్నారని గుర్తు. ఎవరికైనా గుర్తుందా ఏ సందర్భంలోనో?


8:42 అపరాహ్నం వద్ద జూన్ 6, 2008
బొద్దు గుమ్మలు .. బావుంది.
మన కవుల వర్ణనల్లో స్త్రీలు అందరూ బొద్ది గుమ్మలే. స్లిమ్మూ చింతకాయా వాళ్ళకి పనికిరావ్.
ఐనా మీకు కొంచెం సెన్సిటివిటీ తరిఫీదు ఇప్పించాలి! లేకపోతే ఏవిటిదీ .. ఏకంగా భామామణుల బొద్దుత్వం గురించే టపాలు రాసెయ్యడం? హన్నా!
10:50 అపరాహ్నం వద్ద జూన్ 6, 2008
బొద్దు ముద్దు కాదేమో గానీ ఆ పేరుతో ఎముకల గూడులా తయారవ్వడం అసలే ముద్దు కాదు.
జెమినీలో వచ్చే “డాన్స్ బేబీ డాన్స్” చూడండి. ఆ మధ్య సోమాలియాలో కరువుతో గుడ్డలు పీక్కుతిన్న పిల్లలు గుర్తుకు వస్తారు. వెదురు కర్రలకు రవిక తొడిగి లంగా వేసినట్లుంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా ఆడ పిల్లల్లోనే గమనించాను.
“అతి సర్వత్ర వర్జయేత్” గనుక అటు బొద్దూ వద్దు బొమికలూ వద్దు.
–ప్రసాద్
http://blog.charasala.com
11:17 అపరాహ్నం వద్ద జూన్ 6, 2008
కొత్తపాళీ గారు, ఎంత మాట. తెలుగులో బొద్దు అంటే ఎబ్బెట్టుగా ఉందేమో, పోనీ ఇంగిలిపీసులో FAT అందాం.
ప్రసాద్ గారు, మీతో నూరు శాతం ఏకీభవిస్తున్నా.
2:10 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
అయ్య వికటకవిగారూ, చదవేస్తే ఉన్న మతి పోయినట్లు ఆయనోపక్క chubby యే insensitive అంటుంటే మీరు మళ్ళీ FAT అంటారేవిటీ. బొద్దు గున్నా వద్దు, జాజి తీగా వద్దు అనుకుంటే సుబ్బరంగా stewards తోనే నడిపించేసుకోండి.
2:19 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
అయ్యో రామ తెరెస గారు, ఇదొకటా మళ్ళీ నాకు, అసలు వార్త లోని లావు స్థాయి తగ్గించి బొద్దుకి తీసుకొచ్చానండీ బాబూ. ఇహ ఈ పర్యాయ పదాలు/నానార్ధాలు నా వల్ల కాదు కానీ జనాలకి విషయం తెలిసింది కాబట్టి వాళ్ళే అర్ధం చేసుకుంటారు లెండి.
http://news.bbc.co.uk/2/hi/south_asia/7439894.stm
3:07 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
మన కవులూ రచయితలూ చాలా వరకూ బొద్దు ప్రేమికులే. ఇప్పుడైతే, “సన్నగా, నాజూగ్గా,మల్లె తీగలా” అని సాగదీస్తాం గానీ, పాతతరం వాళ్ళు నడుముని తప్ప మరేదీ ‘చిక్కిన’ మగువ గురించి చెప్పిన జ్ఞాపకం నాకైతే లేదు.
7:31 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
ఇక్కడ ఆలోచించాల్సిన మరొ ముఖ్య విషయం ఏమిటంటే ‘వాయు గృహిణులా గురించి మాత్రమే ఈ చర్చ అంతా, స్టీవర్డ్ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు!!!
కాబట్టి మగ వారు లావు వున్నా సమస్య లేదు
7:45 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
శ్రీనివాస్ గారు,
మీకు తెలుసో లేదో , తమిళ సినిమారంగంలో హీరోయిన్లు బొద్దుగా ఉంటేనే జనాలు ఒప్పుకుంటారు. జాజితీగలు మాకొద్దు అంటారు.
కొత్తపాళిగారు,
మీరు మరీను, ఒకవైపు ఆడాళ్ళమీద కామెంట్ చేస్తూ, రాసిన మగవాళ్ళని సున్నితంగా మందలిస్తున్నారా?? ఎవరితోను గొడవ రాకుండా.
అసలు ఈ విమానాలెక్కేది వాళ్ల కాయాల్ని చూడడానికా? ఆయ్!!!!!!!!!!!
8:28 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
నాకయితే స్లిమ్మే ఇష్టం. కింగ్ ఫిషరే ఎక్కుతా
ఏ పని చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి కదా మరి. ఎయిర్ హోస్టెస్సులు స్లిమ్ముగా ఉంటేనే అందం.
8:50 పూర్వాహ్నం వద్ద జూన్ 7, 2008
బొద్దుగుమ్మలు, ముద్దుగుమ్మలంటూ వికటకవి గారు కాస్త హాస్యం మేళవించి చెప్పినా, సూక్ష్మంగా ఆలోచిస్తే వికటకవి గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇప్పటి కాలేజ్ అమ్మాయిల్ని చూస్తే నిజంగా అసలే జన్మాన వీళ్ళు “తినడం” (ఏదయినా కానివ్వండి) అనేది ఎరగరేమో అన్నట్లుగా ఉంటారు. ఇండియా ఇంత కరువు కాటకాల్లో వుందా? అని అనిపించక మానదు వాళ్ళని చూస్తే, కాస్త ఈ కోర్టు వాళ్ళు సినిమాల వైపు కూడా కాస్త దృష్టి సారించి, మరీ అలా ఎముకలు కనపడే అమ్మాయిలు సినిమాల్లో నటించడం నిషిద్ధం అని ఓ రూల్ తీసుకొస్తే బాగుంటుందేమో! (ఇలియాన, శ్రేయ, త్రీష మొ!!).
అయినా మనలో మన మాట వికటకవిగారు, మీ ఖతి సైజు కూడా అంత బొద్దుగా .. (అంటే నేను కూడా లావు స్థాయి తగ్గించి బొద్దుకి తీసుకొచ్చాననుకొండి) విమానాల్లో బొద్దు సుందరిల స్ఫూర్తి అంటార?
5:46 అపరాహ్నం వద్ద జూన్ 7, 2008
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. తమిళనాడులో ఇండియన్ ఎయిర్ లైన్స్ సర్వీసులకి బొద్దుగుమ్మలని బదిలీ చేసేస్తే పోలా. లేకపోతే, కొన్ని సర్వీసుల్లో కేవలం బొద్దుపాటి సేవికల్ని, ఇంకొన్నిటిలో రివటల్ని, ఇలా స్పెషలైజ్ చేసేస్తే పోతుంది. ప్రయాణీకులు ఎవరికి నచ్చిన విమానాలు వాళ్లెక్కుతారప్పుడు.
9:27 అపరాహ్నం వద్ద జూన్ 7, 2008
మహేష్,కార్తీక్,జ్యోతి,ప్రవీణ్,రమణి,అబ్రకదబ్ర లకు ధన్యవాదాలు.
జ్యోతి గారు, ఈసారికి ఒగ్గేయ్యండి. కర్కక్టే, అబ్రకదబ్ర మీరన్నట్లు అయిడియా కూడా ఇచ్చేశారు. అబ్రకదబ్ర , మీ అవిడియా నాకైతే నచ్చేసింది.
రమణి గారు, నా ఖతి మీద మీ కన్ను పడిందీ? ఇదిగో ఇప్పుడే దిష్టి తీసేసాను. వర్డుప్రెస్సులో ఎదురు డబ్బులిచ్చుకొని తెచ్చుకున్న ఖతి మరి.
ప్రవీణ్, మొత్తానికి శతమర్కటుడివనిపించావ్.
10:53 పూర్వాహ్నం వద్ద జూన్ 10, 2008
బొద్దుగుమ్మలుంటే ప్రయాణీకులు తక్కువమంది ఉన్నా ఆ లోటు తెలియదు. వైస్‌వెర్సా… “పుల్లగుమ్మ”లుంటే యెక్కువ మంది (ఇప్పటి కాలంలో) విమానంలో పడతారు, లేదా వాళ్ళని చూసి (చూడడానికి) ఎక్కుతారు.
12:00 అపరాహ్నం వద్ద జూన్ 18, 2008
ala fat anna ‘boddu’ anna cheppe vishayamentante ippati fashion slim and trim ani. edella maa abbaye neeke heroine istamante illiyana antadu………mari vimanaallo ticket konukkune peddabbailaki vaari abhiruchulu vaallakuntayi kada. so maree kareena kapoor la kaakunda soundarya unte chalanukunte baguntundi
8:33 పూర్వాహ్నం వద్ద జులై 9, 2008
aina ee manasika vyabi charamantha vyaparanikai english vaadu pedithe chonga kaarchu kuntu manamuu thai thakka laadatam emii baagaa ledu. good reception koraku evaraitheneem, aada prayaanikulu kandala viiruluni adigithe mii rantha ilaage discuss chesethaara eviti,,,,