దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం
జనవరి 7, 2008దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం గూర్చి కొత్తగా చెప్పేదేముంది. వారి సినీగీతాలు “మేఘమాల” అన్న పేరుతో ఓరియంట్ లాంగ్మన్ వాళ్ళు 1996 లో ప్రచురించిన పుస్తకం నా కంటపడింది. వాటిల్లో మనం వినని పాటలు తక్కువే. నాకు ముందుగా పాట నచ్చి తరువాత ఆయన రాసిన పాటే ఇది అని తెలిసినప్పుడు, ఈ పాట ఆయనది అవటములో ఆశ్చర్యమేముంది అనిపించాయి. మచ్చుకు కొన్ని తగు విరామముతో ఇక్కడ పరిచయం చేస్తాను. ముందుగా, ఇది
సినిమా : భాగ్యరేఖ
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
నీవుండే దా కొండపై
నాస్వామి, నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో||
……………………
రాసినది వికటకవి

