సంస్కృత భాష - చిత్రవిచిత్ర ప్రక్రియలు

ఏప్రియల్ 11, 2008

సంస్కృత భాష, దాని ప్రాముఖ్యం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. భారతీయ భాషల సంగతి అటుంచితే, యూరోపు లోని అనేక భాషలు కూడా సంస్కృతం నుంచే పుట్టాయని కూడా శాస్త్రకారులు చెబుతారు. ఇక వ్యాకరణం తీసుకుంటే, సంస్కృతం మించిన వ్యాకరణం కల భాష మరోటిలేదని మాక్సుముల్లర్ అన్నాడు. ఇంతకీ విషయం ఏమంటే, ఈ మధ్యనే ఓ మంచి పుస్తకం చదివా “The wonder that is Sanskrit” అని. పేరుకి తగ్గట్టుగానే మంచి అద్భుతాలే చెప్పారు ఇందులో.

సంస్కృత భాష గొప్పదనాన్ని వివరిస్తూ అందులోని కొన్ని ప్రత్యేక ప్రక్రియల గూర్చి చాలా బాగా వివరించారు. అందులో “అధమకావ్యాలు”గా పిలవబడేవి కొన్ని. వీటిని అధమకావ్యాలని ఎందుకన్నారంటే సాహితీ విలువల పరంగా వీటిలో స్థాయి తక్కువ. స్థాయి తక్కువన్నానని చిన్నాచితకా శ్లోకాలనుకుంటే పప్పులో కాలేసినట్లే మీరు. స్థాయి తక్కువంటే గంభీరమైన సాహిత్యం కాకుండా కాస్త సరదా సరదా సాహిత్యమన్నమాట. భాషలోని వైశిష్ట్యము, సహజతతో పాటు రాసిన కవుల యొక్క గొప్పతనాన్ని ఇవి తెలియచేస్తాయి. వీటిని చిత్రకావ్యాలు అని కూడా అంటారు. ఇవి అలంకార శాస్త్రములో భాగము. వీటిని రాయడానికి వ్యాకరణం గొప్పగా తెలిసుండాలి. ఇందులో కొన్ని ప్రక్రియలు.

వర్ణచిత్రాలు: ఇందులో పరిమితమయిన హచ్చులు మాత్రమే ఉపయోగించి శ్లోకం చెప్పాలి. కేవలం “ద”,”వ” మరియు “న” లను ఉపయోగించి చెప్పిన ఈ శ్లోకం చూడండి.

దేవానాం నందనో దేవో నోదనో వేదనిందినాం |
దివం దుదావ నాదేన దానే దానవనందిన: ||

దేవతలకు సంతోషము కూర్చువాడునూ, వేదములకు శత్రువులకు(రాక్షసులు) బాధ కూర్చువాడగు దేవుడు(విష్ణువు) లోకమును గొప్ప శబ్దముతో నింపుచూ హిరణ్యకశిపుని చంపెను.

ఇది చూడండి అచ్చంగా “న” తో చెప్పిన శ్లోకం.

న నోననున్నో నున్నేనో నానా నానాననా నను |
నున్నో నున్నో ననున్నేనో నానేనా నున్ననున్ననుత్ ||

అర్ధం:
A man is not a man who is wounded by a low man.
Similarly, he is also not a man who wounds a low man.
The wounded one is not considered to be wounded if his
master is unwounded. And he who wounds a man who is
already wounded, is not a man.

స్థానచిత్రాలు మరియు స్వరచిత్రాలు:ఈ తరహా శ్లోకాలు ఒకే సమూహంలోని హల్లులతో గానీ లేదా కొన్ని హల్లుల సమూహాల్ని నిషేధించటం వల్ల గానీ రచిస్తారు.

అద్భుతమయిన ఈ శ్లోకం చూడండి.

యాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయా ||

దీని అన్వయం (పదాల కూర్పు) ఇది.

యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, యాయాయా, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా

అర్ధం:
The sandals which adorn the lord, which help in attainment of all that is good and auspicious, which give knowledge, which causes the desire (of having the lord as one’s own), which remove all that is hostile, which have attained the lord, which are used for going and coming from one place to another, by which all places of the world can be reached, these sandals are for Lord Vishnu.

ఇవి వింటుంటే, భాష మీద మమకారం పెరిగిపోవట్లేదూ? ఇలాంటి మరిన్ని మరో టపాలో చెబుతాను.


ఓ సరికొత్త మనసు - పుస్తక సమీక్ష

అక్టోబర్ 5, 2007

నే మాట్లాడే పుస్తకం ఓ ఇంగ్లీష్ పుస్తకము, A Whole New Mind By Daniel Pink.

ప్రపంచీకరణతో మనం ఇన్నాళ్ళూ వర్ధమాన దేశాలకు కలిగే కష్టనష్టాలు మాత్రమే చదివాము, విన్నాము. కానీ, ప్రపంచీకరణతో  వల్ల యూరోపు,అమెరికాలు కూడా దెబ్బతింటున్నాయి. ఉదా: అవుట్ సోర్సింగ్ లాంటివి…

ఇది ముఖ్య విషయముగా వచ్చిన పుస్తకమే డేనిఎల్ పింక్ రాసిన A Whole New Mind. ఆసియా దేశాలకు ఉద్యోగాల వలసతో బాగా నష్టపోతున్న అమెరికా వంటి దేశాలు భవిష్యత్తులో మరింత నష్టపోకుండా ఏమి చెయ్యాలన్నది సైన్స్ పరముగా కూడా పరిశీలించిన ఈ పుస్తకం మంచి ఆసక్తికరముగా ఉందనటములో సందేహం లేదు.

ఈనాటి సమాచారయుగంలో (Information Age) కీలక పాత్ర వహిస్తున్న ఎడమమెదడు(Left Brain) చేసే పనులయిన Logic, Analysis & Sequence స్థానంలో కుడిమెదడు చేసే పనులయిన simultaneous, contextual, big-picture capabilities  మాత్రమే రాబోయే భావసంకల్పయుగం(Conceptual Age)లో కీలక పాత్ర వహిస్తాయి అని పింక్ చెబుతాడు. ఎవరయితే సమాచారయుగం నుంచి భావసంకల్పయుగం దిశగా ఎంత త్వరగా వెళుతారో, వారిదే రాబోయే కాలం. లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనులన్నీ ఇప్పుడు వర్ధమాన దేశాలకు అవుట్ సోర్స్ రూపంలో వెళ్ళిపోటం వల్ల (ఇది పెరగటమే తప్ప తరిగేది కాదు), రైట్ బ్రెయిన్ పనులయిన వంటి వాటిపై ఈ దేశాలు దృష్టి పెట్టాలని చెప్తాడు. అలానే రచయిత బానే కష్టపడ్డాడనుకుంటా విషయసేకరణ కోసం. ఇండియాలో సాఫ్టువేరు ఇంజనీర్లని కలవడం, లాఫింగ్ క్లబ్బు (ముంబాయి) కెళ్ళటం లాంటివి.

Left Brain చేసే పనులు ఇవి.  
uses logic,detail oriented,facts rule,words and language,present and past,math and science
can comprehend,knowing,acknowledges order/pattern perception, knows object name
reality based,forms strategies, practical, safe

Right Brain చేసే పనులు ఇవి.
Uses feeling,”big picture” oriented,imagination rules, symbols and images, present and future, philosophy & religion, can “get it” (i.e. meaning) believes appreciates spatial perception, knows object function, fantasy based, presents possibilities impetuous,
risk taking

ఈ దిశగా Six Senses అని ఆరు సూత్రాలు ప్రతిపాదించాడు.

- Design: going beyond the utility of your skill set to its significance and emotional appeal;
- Symphony: considering how your combined competencies and attributes contribute to your unique promise of value;
- Story: crafting messages to clearly communicate what you offer;
- Empathy: building a network of mutual benefit with others;
- Joy: identifying work you love where you can be yourself;
- Meaning: making a difference in the lives of the people you serve.

అంటే, Right Brain పనులు ఆసియా దేశాలకు తెలియదా అన్న ప్రశ్న రావొచ్చు.  కానీ సృజనాత్మకత, రీసెర్చ్ లాంటి వాటి మీద ఆసియా దేశాలు పెట్టుబడి పెట్టగలవా అన్నది పెద్ద సమస్య. గతాన్ని పరిశీలిస్తే, ఇతరులు కనిపెట్టినవాటిని  Re-Produce చెయ్యటము ద్వారా ఆసియా దేశాలు పారిశ్రామికంగా ఆధారపడినాయి కదా.

ఈయన చెప్పింది నిజమే, ఎంచేతంటే కళలన్నీ  Right Brain పనులే.  అందుకేనేమో, వాళ్ళు (మంచి కళాకారులు) ఎప్పటికీ డిమాండే.

ఈ సందర్భములోనే అలానే మెదడును గూర్చి కొన్ని మంచి సమాచారము కూడా ఇచ్చాడు. ఇవి చదవండి.

The left hemisphere controls the right side of the body;
the right hemisphere controls the left side of the body;

The left hemisphere is sequential;
the right hemisphere is simultaneous;

The left hemispehere specializes in text;
the right hemisphere specializes in context;

The left hemisphere analyzes details;
the right hemisphere synthesizes the big picture;

The left hemisphere is the thousand words;
the right hemisphere is the picture;

అలాగే అంతర్జాలంలో ఈ చిన్నపాటి పరీక్ష వెతికి పట్టా. దీని ద్వారా మీరు ఏ మెదడు ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులో తెలుస్తుంది. పుస్తకం మరీ పెద్దది కూడా కాదు. ఓ ప్రయాణంలో ఈజీగా చదివేయొచ్చు. దాదాపు ఓ రెండు వందల పేజీలనుకుంటా.  

అమెజాన్ లో ఈ పుస్తకం దొరుకుతోంది.