మనవాడు అని మనం గర్వంగా చెప్పుకోదగ్గ వారిలో డాక్టర్. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ప్రముఖులు. దాదాపు 15 - 20 ఏళ్ళ క్రిందట తితిదే వారు శ్రీ బాలమురళీకృష్ణ గారి గాత్రములో త్యాగరాజ పంచరత్నాలు క్యాసెట్ల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పంచరత్నాలతో పాటు అందులో తిల్లానా కూడా ఉండేది. దాదాపు రోజూ వినటం వల్ల అప్పట్లో అవి చాలా వరకు నోటికి వచ్చేవి. ముఖ్యంగా నాకు సంగీతంలో ప్రవేశం లేకపోయినా, ఆయన పాడిన తిల్లానాలో ఏదో ఓ ప్రత్యేకత అనిపించేది. అలా 15 ఏళ్ళప్పుడే నేను ఆయన అభిమానినయిపోయాను.
శాస్త్రీయ సంగీతం పట్ల పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా బాలమురళీకృష్ణ గారు పాడిన తిల్లానా ఆ అసక్తి కలగచేయగలదని నాకనిపిస్తుంది. నా భజనకీర్తనలు బ్లాగులో గంధము పుయ్యరుగా కీర్తన కోసం వెతుకుతుంటే, ఈ తిల్లానా అగుపడింది. మీతో ఇలా పంచుకోవాలనిపించి, ఇదిగో ఇలా ఈ టపా రాస్తున్నాను.
ముందుగా బాలమురళి గారి గూర్చి వారి శిష్యులు శ్రీ రామ వర్మ వారి నోటి నుంచి నాలుగు మాటలు.
ఆపై ఈ తిల్లానా వినండి.
రాసినది వికటకవి

